ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో షియోమీ 18 ప్రోను ప్రదర్శించిన కంపెనీ, త్వరలోనే దేశీయ మార్కెట్లోకి తెస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. గ్లోబల్ లాంచ్ జరిగిన వెంటనే ఇండియాలోనూ విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రో మ్యాక్స్ వేరియంట్ రాకపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. లాంచ్ తేదీ, ఈవెంట్ వివరాలకు సంబంధించిన తొలి హింట్స్ షియోమీ ఇండియా సోషల్ మీడియా ఖాతాల్లోనే కనిపించనున్నాయి. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 5,999 యువాన్లుగా ఉంది. దీని ఆధారంగా చూస్తే ఇండియాలో బేస్ వేరియంట్ రూ. 65,000 నుండి రూ. 75,000 రేంజ్‌లో వచ్చే అవకాశం ఉంది. సేల్ మొదటి వారంలో బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉంటాయి కాబట్టి, ఎఫెక్టివ్ ప్రైస్ చైనా ధరకే దాదాపు దగ్గరగా అందుబాటులోకి రావచ్చు. ఇండియా వేరియంట్ స్పెసిఫికేషన్లు కూడా చైనా మోడల్‌ను పోలి ఉండే చాన్స్ ఉంది. ఇందులో ప్రివ్యూ కోసం వెనుక వైపు పెద్ద ఆర్‌ఈడి డిస్‌ప్లే, నెక్స్ట్ జెన్ ఏఐ, గేమింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రొసెసర్, డ్యూయల్ 200-మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన లైకా ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే, టెలికాం నిబంధనలు, అనుమతుల ఆధారంగా షియోమీ హార్డ్‌వేర్-లెవెల్ 'స్మార్ట్ ప్రైవసీ డిస్‌ప్లే' ఇండియా వెర్షన్‌లో వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
3
Beranda
› 999 Yuan
› business
› In China
› technology
› the phone starts at 5
› Xiaomi confirms via social media that the 18 Pro is coming to the Indian market soon
› త్వరలో దేశీయ మార్కెట్లోకి షియోమీ 18 ప్రోను తెస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసిన కంపెనీ
Subscribe to:
Post Comments (Atom)
