తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ జోలార్‌పేట జంక్షన్‌లో ఇంజిన్ అమర్చని ఏడు ఖాళీ రైలు బోగీలు వాటంతట అవే పట్టాలపై పరుగులు తీశాయి. ప్రధాన మార్గంలోకి ప్రవేశించి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ కోచ్‌లు, తామలేరి ముత్తూరు సమీపంలో పట్టాలు తప్పి ఆగిపోయాయి. యార్డులో రిపేర్ పనుల నిమిత్తం ఉంచిన ఈ బోగీలను ఒక ఇంజిన్ ద్వారా ముందుకు తరలించారు. అయితే, కోచ్‌లు కదలకుండా చక్రాలకు బ్రేకులు (హ్యాండ్‌బ్రేక్స్/స్టాపర్స్) సరిగ్గా వేయకపోవడంతో అవి వేగం పుంజుకుని యార్డు దాటి మెయిన్ లైన్‌లోకి వచ్చేశాయి. ట్రాక్‌పై ఎలాంటి ఇంజిన్ లేకుండా బోగీలు వేగంగా వస్తూ వింత శబ్దం చేస్తుండటాన్ని సమీపంలోని గేట్‌కీపర్ గుర్తించారు. తక్షణం స్పందించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో, అధికారులు కర్ణాటక-బెంగళూరు వైపు నుంచి జోలార్‌పేట వైపు వస్తున్న మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో పెను విపత్తు తృటిలో తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు గ్యాస్ కట్టర్లతో బోగీలను వేరుచేసి, జేసీబీల సహాయంతో ట్రాక్‌పై నుంచి పక్కకు జరిపాయి. ఈ అంతరాయం వల్ల బెంగళూరు-చెన్నై ప్రధాన మార్గంలో పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.
రైల్వే నిర్వహణ విభాగం నిర్లక్ష్యం : పట్టాలపై ఆరు కిలోమీటర్లు దూసుకెళ్లిన ఏడు ఖాళీ రైలు బోగీలు
byTelugu Lo Computer
•
•
2 min read
