అమెరికాలో భారతీయ యువతి దారుణ హత్య !

Telugu Lo Computer
0


మెరికాలో భారతీయ యువతి నిఖిత గోడిశాల దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మకు చెందిన అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురయ్యారు. రక్తపుమడుగులో కనిపించారు. నిఖితను చంపిన అనంతరం అర్జున్ శర్మ భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసి, దర్యాప్ చేపట్టారు. అర్జున్ శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎల్లికాట్ సిటీలో నివసించే తన స్నేహితురాలు నిఖిత కనిపించట్లేదంటూ అర్జున్ శర్మ తొలుత హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు నమోదైంది. న్యూ ఇయర్‌ ఈవ్ నుండి అదృశ్యమైనట్లు పేర్కొన్నాడు. కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో చివరిసారిగా ఆమెను చూసినట్లు పోలీసులకు వెల్లడించాడు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన అదే రోజున అర్జున్ శర్మ భారత్‌కు బయలుదేరి వెళ్లినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ప్రైమ్ సస్పెక్ట్ కింద అతనిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. హోవార్డ్ కౌంటీ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ వెంటనే అతని ఫ్లాట్‌ను సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ జారీ చేసింది. 3వ తేదీన డిటెక్టివ్‌లు శర్మ అపార్ట్‌మెంట్‌ను సోదా చేయగా నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆమె మరణించినట్లు తేల్చారు. డిసెంబర్ 31న రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు శర్మపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ దారుణ హత్య వెనుక గల అసలు ఉద్దేశ్యాన్ని కనుగొనేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి యూఎస్ ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి హోవార్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తోన్నారు. కాగా నిఖిత హత్యోదంతాన్ని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. నిఖిత కుటుంబంతో సంప్రదిస్తున్నామని, వారికి కాన్సులర్ సహాయం అందిస్తున్నామని తెలిపింది. స్థానిక అధికారులతో కూడా ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default