‘ఇండేన్ ఎక్స్‌ట్రా లైట్ నౌ’ను ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
‘ఇం డేన్ ఎక్స్‌ట్రా లైట్ నౌ’ పేరుతో కొత్త 10 కేజీల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇదే సేవలో భాగంగా 5 కేజీల ‘ఛోటూ’ ఎల్పీజీ సిలిండర్ కూడా బుక్ చేసిన నాలుగు గంటల్లోనే వినియోగదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ ఎ.ఎస్. సాహ్నీ మాట్లాడుతూ కొత్త కాంపోజిట్ సిలిండర్ సాధారణ సిలిండర్లతో పోలిస్తే తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టని ప్రత్యేక సాంకేతికతతో రూపొందించామని తెలిపారు. అంతేకాకుండా సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయట నుంచే సులభంగా తెలుసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉందని చెప్పారు. ఉద్యోగులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 10 కేజీల సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తొలిదశలో పుణే, గుర్గావ్, ఇండోర్, కోయంబత్తూర్ నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. ఆగస్టులో మరో 25 నగరాలకు విస్తరించనున్నట్లు, అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండియన్ ఆయిల్ వెల్లడించింది. వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వన్ యాప్, అధికారిక వెబ్‌సైట్ లేదంటే వాట్సాప్ ద్వారా కొత్త గ్యాస్ కనెక్ష...