Posts

Showing posts with the label Chairpersons of Corporations in Telangana Finalized

తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

Image
తె లంగాణలో కార్పొరేషన్ల మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారైయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం 121 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో 5 స్థానాలు ఎస్టీలకు, 17 ఎస్సీలకు, 38 బీసీలకు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో స్థానిక పాలనలో మహిళల పాత్ర మరింత బలపడుతుందని ఆమె చేప్పారు. కార్పొరేషన్ల వారీగా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, రామగుండం కార్పొరేషన్‌ను ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ బీసీ మహిళలకు దక్కగా, మంచిర్యాల, కరీంనగర్‌ కార్పొరేషన్లు బీసీ జనరల్‌ కేటగిరీలోకి వెళ్లాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని మహిళా జనరల్‌గా ప్రకటించారు.  గ్రేటర్‌ వరంగల్‌ను జనరల్‌ కేటగిరీకి కేటాయించగా, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ కార్పొరేషన్లను మహిళా జనరల్‌ రిజర్వేషన్‌లో చేర్చారు. ఈ నిర్ణయాలతో ఆయా నగరాల్లో మహిళా నాయకత్వం మరింత బలోపేతం కానుందని ...