మారుతి సుజుకి కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు !
మా రుతి సుజుకి నెక్సా కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, సంస్థాగత ప్రయోజనాలు వంటి వాటిని కలిపి కొన్ని మోడళ్లపై భారీగా ప్రయోజనాలు అందిస్తోంది. ఈ నెలలో అత్యధికంగా మారుతి సుజుకి ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. అయితే అన్ని ఆఫర్లు ప్రతి కస్టమర్‌కు ఒకేలా వర్తించవు. నగరం, డీలర్, వాహనం వేరియంట్, స్టాక్, ఎక్స్ఛేంజ్ వాహనం వయసు వంటి అంశాలపై తుది ఆఫర్ ఆధారపడి ఉంటుంది. నెక్సా శ్రేణిలో అత్యధిక ప్రయోజనం ఇన్విక్టోపై లభిస్తోంది. ఈ ప్రీమియం ఎమ్‌పీవీపై రూ.55,000 కన్జ్యూమర్ ఆఫర్‌తో పాటు అర్హతను బట్టి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.50,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.30,000 లాయల్టీ అప్‌గ్రేడ్, రూ.20,000 ఇన్‌స్టిట్యూషనల్ డిస్కౌంట్ ఉన్నాయి. మొత్తం ప్రయోజనం రూ.1.55 లక్షల వరకు చేరుతుంది. ఇన్విక్టో ఎక్స్‌షోరూమ్ ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉంది. సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు ప్రయోజనం, డెల్టా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనం లభిస్త...