17న రెడ్మీ 10 సిరీస్ విడుదల
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్జజం షియోమి సబ్‌బ్రాండ్ రెడ్మీ వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో భారత్‌లో దూసుకుపోతుంది. ఈ నెల ప్రారంభంలో రెండ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌ను ఆవిష్కరించిన కంపెనీఇప్పుడు రెడ్మీ 10 సిరీస్ లాంచింగ్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌ను ఈ నెల 17న విడుదల రెడీఅవుతోంది. షియోమి అధికారికంగా పంచుకున్న వివరాల ప్రకారం, రెడ్మీ10 సిరీస్‌ను మార్చి 17న మార్కెట్లోకి తీసుకురానుంది. రెడ్‌మి 10 సిరీస్ లాంచింగ్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఓ టీజర్‌ను కూడా రిలీజ్చేసింది. రెడ్మీ నోట్ 11 ప్రో ఫోన్లో అందించే కెమెరా, డిస్‌ప్లే, అతిపెద్ద బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై టీజర్లో స్పష్టతనిచ్చింది. ఈ వివరాలను బట్టి, రెడ్మీ 10 సిరీస్ అదిరిపోయే డిజైన్‌తో వస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు టీజర్లో పేర్కొంది. రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాప్, అల్ట్రా-ఫాస్ట్ స్టోరేజ్ అందించనున్నట్లు తెలిపింది. అంటే, రెడ్మీ 10 సిరీస్ 5000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ...