ప్రతిపక్షాల నిరసనలతో అసెంబ్లీలో ఉద్రిక్తత
తె లంగాణ శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. సభను సజావుగా నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటం కోసం బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దిగాయి. సభాపర్వం మొదటి రోజే సభలో ఉద్రిక్తత నెలకొంది. 22A అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో అసెంబ్లీలోకి ప్రవేశించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, గతంలోనే ఇలా చేయవద్దని చెప్పామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్లకార్డులను మార్షల్స్‌కు అప్పగించాలని, లేకుంటే బలవంతంగా బయటకు పంపిస్తామని హెచ్చరించారు. 22Aపై చర్చించే అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై చర్చిద్దామని, అయితే సభ సజావుగా జరగాలంటే ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా 22Aపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకారం అందించాలని కోరారు. అయ...