Posts

Showing posts with the label 26న శాంసంగ్ గెలాక్సీ మెగా ఈవెంట్ !

26న శాంసంగ్ గెలాక్సీ మెగా ఈవెంట్ !

Image
శాం సంగ్ ఈ నెల 26న 'గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్' నిర్వహిస్తోంది. లైవ్ కార్యక్రమంలో గెలాక్సీ జడ్ ఫోల్డ్5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఈ మేరకు తాజా స్మార్ట్ ఫోన్ టీజర్లను వెబ్ సైట్ లోనూ, సోషల్ మీడియాలోనూ విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఒక ఫ్లిప్ ఫోన్, మరొక ఫోల్డ్ ఫోన్, నోట్ బుక్, స్మార్ట్ వాచ్ కనిపిస్తున్నాయి. ఈ నెల 26న జరిగే ఆవిష్కరణలో గెలాక్సీ జడ్ ఫోల్డ్5, గెలాక్సీ జడ్ ఫ్లిప్5 స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల్లో గెలాక్సీ టాబ్ ఎస్9 ఆల్ట్రా, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్, గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ బడ్స్3 మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. మెగా ఈవెంట్ సందర్భంగా శాంసంగ్.. తన కస్టమర్లకు పలు స్పెషలాఫర్లు కూడా తెచ్చింది. శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఈ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే కొనుగోలుదారులు రూ.1999లకు రీఫండబుల్ ప్రీ-రిజర్వ్ పాస్, రూ.5000 విలువైన ఈ-ఓచర్ కొనుగోలు చేయొచ్చు. ఇక శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్లు వచ్చేనెల 14 నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 7.6-అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే వర్కింగ్ @ 120 హెర్...