Posts

Showing posts with the label Eagle Force Arrests 27 Software Employees

కిరాణా షాపు మాటున గంజాయి అమ్ముతున్న లేడీ డాన్‌ నీతూభాయ్ : 27 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను అరెస్టు చేసిన ఈగల్‌ ఫోర్స్‌

Image
హై దరాబాద్‌లో కిరాణా షాపు మాటున నీతూ భాయ్‌ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను ఈగల్‌ ఫోర్స్‌  పట్టుకున్నారు. గతంలోనే నీతూ భాయ్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు పీడీ యాక్ట్‌ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్‌ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది. రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్‌రాంగూడలో గంజాయి డాన్‌ నీతూ భాయ్‌ కోసం నిఘా పెట్టిన ఈగల్‌ ఫోర్స్‌ గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్‌ ఫోర్స్‌ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్‌ పరారైంది.