Posts

Showing posts with the label 36

తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

Image
దే శీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం 0.69 శాతం మేర తగ్గింది. 1,54,820 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 3,000 రూపాయలకు పైగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అదే విధంగా వెండి రేటు కూడా పడిపోయింది. 3.07% తగ్గి 2,36,851 వద్ద స్థిరపడింది. ముంబైలో స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,56,500కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,400 పలుకుతోంది. దేశంలోని ప్రధాన నగరాలలో ధరలు విభిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల బంగారం 1,43,100 రూపాయలు, 24 క్యారెట్లు 1,56,000గా రూపాయలుగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,43,300, 24 క్యారెట్ల బంగారం రూ.1,56,000కు చేరింది. పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్లకు రూ. 1,43,400, 24 క్యారెట్లకు రూ. 1,56,500 గా ఉంది.  కిందటి నెలలో బంగారం ధర పది గ్రాములకు రూ.1,80,000 మించిన విషయం తెలిసిందే. ఇది ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. వెండి ధర కూడా కిలో రూ. 4,20,000తో రికార్డు స్థాయికి చేరింది. దీని తర్వాత ఈ రెండింటి ...

రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం : పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేటాయించిన కేంద్రం

Image
దే శంలోని రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్‌ మంత్రివర్గం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో 45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. చెన్నై - సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్, కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు హై స్పీడ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది. ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను కేబినెట్‌ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల న...