Posts

Showing posts with the label actor and racer Ajith Kumar is also competing in this fifth round of the championship

మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్ ఈవెంట్‌ : ప్రత్యేక అతిథిగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్

Image
ఇం గ్లాండ్‌లోని ప్రఖ్యాత సిల్వర్స్టోన్ సర్క్యూట్‌లో జరగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్ ఈవెంట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. యూకేలో పోటీపడుతున్న భారతీయ డ్రైవర్లకు మద్దతుగా నిలవడంతో పాటు, 44 కార్ల గ్రిడ్ ముందు ప్రారంభమయ్యే ఈ రెండు గంటల ఎండ్యూరెన్స్ రేసును సీఎం విజయ్ అధికారికంగా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని లీ మాన్స్ కప్ నిర్వాహకులు తమ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. సెప్టెంబర్ 12న సిల్వర్స్టోన్ యొక్క 5.891 కిలోమీటర్ల గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్‌లో ఈ ప్రతిష్టాత్మక రేసు జరగనుంది. ఈ ఛాంపియన్‌షిప్ ఐదవ రౌండ్‌లో ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ కూడా బరిలో దిగుతున్నారు. అజిత్ రెడ్‌ఆంట్ బై విరాజ్ తరఫున ఎల్‌ఎంపీ3 ప్రో/యామ్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన రోమెయిన్ వోస్నియాక్‌తో కలిసి అజిత్ కుమార్ ఈ రేసులో పాల్గొంటున్నారు. అలాగే మాజీ ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్, ఆదిత్య పటేల్ జోడీ సైతం మరో ఎల్‌ఎంపీ3 విభాగంలో అజిత్ రెడ్ ఆంట్ రేసింగ్ తరఫున ప్రత్యేకంగా బరిలో నిలుస్తున్నారు.