తెలంగాణలో నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై నిషేధం : రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి
తె లంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది.ఏ రూపంలోనైనా పనీర్ తయారు చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, విక్రయించడంపై నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది. ఇందుకు సంబంధించి అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ నంబర్ 807 జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆహార భద్రత – ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30(2)(a) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.నిషేధం కేవలం నాన్-డెయిరీ పనీర్ తయారీకి మాత్రమే పరిమితం కాదు. నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌ను 'పనీర్' పేరుతో తయారు చేసి విక్రయించడం, ప్యాక్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం కూడా నిషేధం పరిధిలోకి వస్తుంది. అంటే పాల ఉత్పత్తిగా గుర్తింపు పొందిన పనీర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తిని 'పన...