ఆర్మీ క్యాంటీన్లలో తక్కువ ధరకే మారుతి సుజుకి స్విఫ్ట్ !
ఆర్మీ క్యాంటీన్లలో అమ్ముడయ్యే వస్తువులపై సగం పన్ను రాయితీ ఉంటుంది. అంటే సివిల్ మార్కెట్‌లో పన్ను 18 శాతానికి తగ్గితే, క్యాంటీన్‌లో అది కేవలం 14 శాతంగానే ఉంటుంది. ఈ మార్పుల వల్ల మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలపై భారీ ప్రభావం పడింది. కార్స్ 24 తాజా నివేదిక ప్రకారం స్విఫ్ట్ బేస్ మోడల్ అయిన LXI ధర ఇప్పుడు క్యాంటీన్‌లో కేవలం రూ. 5.07 లక్షలకే లభిస్తోంది. బయటి మార్కెట్‌లో దీని ధర రూ. 6.49 లక్షలుగా ఉండగా, సైనికులకు దాదాపు రూ. 1.42 లక్షల మేర ఆదా అవుతోంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ల విషయానికి వస్తే లాభం మరింత పెరుగుతోంది. వేరియంట్ల వారీగా చూస్తే స్విఫ్ట్ VXI మోడల్ షోరూమ్ ధర రూ. 7.29 లక్షలు కాగా, క్యాంటీన్‌లో రూ. 5.74 లక్షలకే లభిస్తోంది. అలాగే ZXI మోడల్ మీద రూ. 1.68 లక్షలు, ZXI+ మీద రూ. 1.76 లక్షల వరకు రాయితీ లభిస్తోంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇష్టపడే వారికి కూడా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ZXI+ AMT టాప్ వేరియంట్ బయట రూ. 9.49 లక్షలు ఉంటే, క్యాంటీన్‌లో కేవలం రూ. 7.60 లక్షలకే దొరుకుతుంది. అంటే ఒక కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 1.89 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 34 సీఎస్‌డీ డిపోల ద్వ...