Posts

Showing posts with the label 354A(A1)(I) 354D IPC కింద రెండో ఎఫ్‌ఐఆర్‌

జయసూర్యపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు !

Image
మ లయాళ చిత్ర పరిశ్రమలో వేధింపులకు సంబంధించి నటుడు జయసూర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు 354, 354A(A1)(I) 354D IPC కింద రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నటి మిను మునీర్ నుంచి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తరువాత కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. విచారణలో భాగంగా మునీర్ తన అనుభవాలను వివరిస్తూ, ఒకసారి, తొడుపుజాలోని ఓ లొకేషన్‌లో నేను టాయిలెట్ నుండి బయటకు వస్తుండగా, జయసూర్య నన్ను వెనుక నుండి కౌగిలించుకుని, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, లైంగికంగా వేధించాడని తెలిపింది. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.