ప్రపంచ కార్మికుల దినోత్సవ గూగుల్ ప్రత్యేక డూడుల్
ప్ర పంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. ఈ డూడుల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కృషిని గౌరవించింది. ఈ డూడుల్‌లో "Google" అనే పదంలోని ప్రతి అక్షరం ఒక వృత్తిని సూచించేలా డిజైన్ చేశారు. సమాజం నడవడానికి ప్రతి ఉద్యోగం ముఖ్యమని ఇది చెబుతోంది. చిన్న పని అయినా, పెద్ద పని అయినా సమాన ప్రాధాన్యం ఉందని గూగుల్ సందేశం ఇచ్చింది. ఈ డూడుల్‌తో గూగుల్ తెలిపిన సందేశం. "మోడర్న్ వర్క్‌ప్లేస్‌ను నిర్మించిన కార్మికులు, హక్కుల కోసం పోరాడిన వారిని గౌరవిస్తున్నాం." అంటే, నేటి సమాజం అభివృద్ధికి కార్మికులే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.