About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label automobile. Show all posts
Showing posts with label automobile. Show all posts

సరికొత్త డిజైన్‌తో రానున్న వోక్స్‌వ్యాగన్ సెడాన్ విర్టస్

వోక్స్‌వ్యాగన్ ఇండియా తన పాపులర్ సెడాన్ విర్టస్‌ను సరికొత్త డిజైన్‌తో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. 2022 జూన్‌లో విడుదలైన ఈ కారు, జర్మన్ ఇంజనీరింగ్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం, ప్రీమి యం డిజైన్, భద్రతతో వినియోగదారుల ఆదరణ పొం దింది. త్రిభుజాకార ప్రేరణతో రూపొందించిన ఈ కొత్త రూపు, కారుకు ఆధునికతను అందిస్తుంది. వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ, విర్టస్ తన సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచిం ది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా వాహనానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను కాపాడుతూనే, సరికొత్త సమకాలీన రూ పాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని అన్నారు.

Read More...

మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ SUV విడుదల : విడుదలైన 36 గంటల్లో 550 మందికి పైగా కారు కోసం నమోదు చేసుకున్న వినియోగదారులు

దేశీయ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ అత్యంత అధునాతనమైన సరికొత్త ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. ఈ సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ. 78.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ SUV సామర్థ్యం, బ్యాటరీ పనితీరు విభాగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన 94 kWh బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. ఈ కారును ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 711 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా పేర్కొంది. దూరప్రాంత ప్రయాణాలకు ఈ రేంజ్ ఎంతగానో ఉపయోగపడనుంది. 39.1 ఇంచుల MBUX హైపర్ స్క్రీన్ & అత్యాధునిక ఫీచర్లు ఇంటీరియర్ పరంగా ఈ కారు అత్యంత విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో ప్రధాన ఆకర్షణగా 39.1 ఇంచుల బృహత్తర MBUX హైపర్ స్క్రీన్ ను అందించారు. ప్రయాణికులు, డ్రైవర్‌కు అత్యుత్తమ ఇన్ఫోటైన్‌మెంట్ అనుభవాన్ని అందించేందుకు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కనెక్టెడ్ కార్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ సిస్టమ్‌లను పొందుపరిచారు. దేశంలో తన తయారీ కార్యకలాపాలు, అసెంబ్లీ ప్లాంట్లను విస్తరించే వ్యూహంలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ దాదాపు రూ. 200 కోట్ల అదనపు పెట్టుబడిని పెట్టింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్‌లో ఊహించని స్పందన లభించింది. కారు ఫీచర్లు, లుక్స్ పట్ల వాహన ప్రియులు తీవ్ర ఆసక్తి చూపించడంతో విడుదలైన కేవలం 36 గంటల్లోనే 550 మందికి పైగా వినియోగదారులు ఈ కారు కోసం నమోదు  చేసుకోవడం విశేషం.

Read More...

దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్న ఇటాల్‌జెట్

ఇటలీకి చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ఇటాల్‌జెట్   భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న EICMA 2026 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ప్రదర్శనలో తన కొత్త డ్రాగ్‌స్టర్ స్కూటర్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రదర్శనలో ఇటాల్‌జెట్ మూడు కొత్త మోడళ్ల పరిచయం తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కూడా స్కూటర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కోల్హాపూర్‌కు చెందిన మోటోహౌస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా భారతీయ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. డిజైన్,పెర్ఫార్మన్స్ లో ప్రత్యేక గుర్తింపు పొందాయి . ఇటాల్‌జెట్ స్కూటర్ లో 278cc సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,250rpm @ 23.8hp పవర్‌,టార్క్ 6,250rpm@ 26Nmగా ఉంటుంది . ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బెల్ట్ డ్రైవ్ సిస్టం ఉంటాయి. డిజైన్ విషయానికి వస్తే Dragster 300 ప్రత్యేకమైన ఎక్స్‌పోజ్డ్ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. సాధారణ స్కూటర్లకు భిన్నంగా ఫ్రేమ్, మెకానికల్ పార్ట్స్ బయటకు కనిపించేలా దీన్ని రూపొందించారు. ముందు భాగంలో Independent Steering System టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో సింగిల్ ఆర్మ్, హైడ్రోన్యూమాటిక్ షాక్ అబ్జార్బర్, అడ్జస్టబుల్ స్ప్రింగ్ ఉంటాయి. వెనుకవైపు లింక్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 240mm డిస్క్, వెనుక 175mm డిస్క్ బ్రేక్‌లతో పాటు Brembo బ్రేకింగ్ , డ్యూయల్ ఛానల్ ABS అందించారు. ముందు 120/70 R12, వెనుక 140/60 R13 టైర్లు ఉంటాయి. సేఫ్టీతో పాటు రైడింగ్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సిస్టం ను రూపొందించారు. ఇతర ఫీచర్లలో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్, 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 770mm సీట్ హైట్ ఉన్నాయి.  ఇటాల్‌జెట్ స్కూటర్ మోడల్ లో 449cc ప్యారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది DOHC టెక్నాలజీతో రూపొందించారు . ఈ ఇంజన్ 9,500rpm @ 47.58hp పవర్‌, 8,000rpm@41Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు SmartShift టెక్నాలజీ అందించారు. ఈ ప్రత్యేకమైన సిస్టం ద్వారా ఆటోమేటిక్ గేర్ ఆపరేషన్‌తో పాటు హ్యాండిల్‌బార్‌పై ఉండే ప్యాడిల్ షిఫ్టర్ల సహాయంతో మాన్యువల్ తరహాలో గేర్లు మార్చుకోవచ్చు. దీంతో రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా రైడింగ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. డిజైన్ పరంగా Dragster 459 ఎక్స్‌పోజ్డ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అగ్రెసివ్ బాడీ స్టైలింగ్, స్పోర్టీ రైడింగ్ పొజిషన్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ Marzocchi USD ఫోర్క్, వెనుకవైపు Marzocchi మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. ఇందులో 15 ఇంచుల వీల్స్‌తో పాటు Pirelli టైర్లు ఉపయోగించారు. ముందు 120 సెక్షన్, వెనుక 160 సెక్షన్ టైర్లు ఉంటాయి. బ్రేకింగ్ లో ముందు రెండు 270mm డిస్క్ బ్రేకులు, వెనుక 260mm డిస్క్ బ్రేక్ అందించారు. Brembo బ్రేకింగ్ వ్యవస్థతో పాటు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి జారుడు రోడ్లపై, ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో స్కూటర్‌పై నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇతర ఫీచర్లలో కలర్ TFT డిస్‌ప్లే, LED లైటింగ్, 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 815mm సీట్ హైట్ ఉన్నాయి. మూడు మోడళ్లలో అత్యంత శక్తివంతమైన స్కూటర్. ఇందులో 698cc ప్యారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది DOHC టెక్నాలజీతో రూపొందించారు . Autocar India నివేదిక ప్రకారం ఈ ఇంజన్ 70hp పవర్, 70Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే Italjet అధికారిక అంతర్జాతీయ టెక్నికల్ షీట్ ప్రకారం 8,000rpm @ 68hp పవర్, 5,500rpm @ 67Nm టార్క్ అందిస్తుంది . ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, చైన్ డ్రైవ్ సిస్టం ఉంటాయి. ఇది సాధారణ ఆటోమేటిక్ స్కూటర్లకు భిన్నంగా మోటార్‌సైకిల్ తరహా రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే Dragster 700 ఎక్స్‌పోజ్డ్ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అగ్రెసివ్ స్పోర్టీ బాడీవర్క్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ Marzocchi USD ఫోర్క్, వెనుకవైపు Marzocchi అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. వెనుక సస్పెన్షన్‌లో ISAS సిస్టం ను ఉపయోగించారు. ఇందులో ముందు, వెనుక 15 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. Pirelli 120/70 R15 ఫ్రంట్, 160/60 R15 రియర్ టైర్లు అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 270mm డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుక 260mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. Brembo కాలిపర్లు, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సేఫ్టీ ఫీచర్లుగా ఉన్నాయి. ఇతర ఫీచర్లలో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, LED లైటింగ్, 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 815mm సీట్ హైట్ ఉన్నాయి. అంతర్జాతీయ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లుగా పేర్కొన్నారు.

Read More...

డిసెంబర్ 15 నుంచి కారు, బైక్, స్కూటర్ ఇన్సూరెన్స్‌లో మార్పులు : సర్క్యూలర్ జారీ చేసిన ఐఆర్‌డీఏఐ

సుప్రీంకోర్టు ఆదేశాకు అనుగుణంగా ఇన్సూరెన్స్ పాలసీల ఎంపికలో పారదర్శకతను పెంచేందుకు భారత ఇన్సూరెన్స్ నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ ) ఓ సర్క్యూలర్ జారీ చేసింది. బీమా కవరేజీలో నాలుగు అంచెల కవరేజీ ఫ్రేమ్‌వర్క్ ని ప్రకటించింది. ఈ నూతన విధానం డిసెంబర్ 15, 2026 నుంచి విక్రయించే ప్రతి నూతన ప్రైవేట్ వాహన పాలసీకి వర్తిస్తుంది. ఇకపై వాహనదారులు తమకు నచ్చిన రక్షణను తామే స్వయంగా ఎంచుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

ఐఆర్‌డీఏఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం వాహన ఇన్సూరెన్స్ నిబంధనలు నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు. 

1) ప్రమాదం జరిగినప్పుడు ఇతర వ్యక్తులకు కలిగే శారీరక గాయాలు, మరణం లేదా వారి ఆస్తి నష్టానికి చెల్లించే పరిహారం. ఇది చట్టప్రకారం ప్రతీ వాహనానికి తప్పనిసరి. 

2) కార్లలో ప్రయాణించే ప్యాసింజర్లు, టూ-వీలర్లపై వెనుకు కూర్చునే పిల్లియన్ రైడర్లు, యజమాని తరఫున డ్రైవింగ్ చేసే ఉద్యోగుల చట్టపరమైన బాధ్యతకు వర్తించ కవరేజ్.

3) వాహన యజమానికి తప్పనిసరిగా వర్తించే వ్యక్తిగత ప్రమాద రక్షణతో పాటు, డ్రైవర్ లేదా ప్రయాణికులకు ఐచ్ఛికంగా తీసుకునే వ్యక్తిగత ప్రమాద పరిహార పాలసీ.

4) ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు లేదా దొంగతనాల వల్ల మీ సొంత కారు లేదా బైకుకు జరిగే నష్టానికి వర్తించే కవరేజ్.

కస్టమర్లు ఇన్సూరెన్స్ కొనే సమయంలో ఏ కవరేజ్ కావాలే స్వయంగా ఎంచుకోవడానికి కస్టమర్ ఆప్షన్ ఫామ్ ను అందిస్తారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పక్కాగా టిక్ చేసి కవరేజ్ పొందవచ్చు. ఏ విభాగానికి ఎంత వడ్డీ, ప్రీమియం చెల్లిస్తున్నారో స్పష్టంగా పాలసీ షెడ్యూల్‌లో విడివిడిగా చూపిస్తారు. డిసెంబర్ 15 తర్వాత ఇప్పటికే ఉన్న పాలసీదారులు కూడా అదనపు ప్రీమియం చెల్లించి ప్రయాణికుల రక్షణ ను ఎండార్స్‌మెంట్ ద్వారా జత చేసుకోవచ్చు.

బీమా సుగమ్ లో లభ్యం ఈ నూతన నాలుగు అంచెల ఇన్సూరెన్స్ విధానాన్ని డిసెంబర్ 15 నాటికి కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ ఫారమ్ బీమా సుగమ్ లో కూడా అనుసంధానించాలని ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కస్టమర్లు వివిధ కంపెనీల పాలసీల ప్రీమియంలను ఒకే చోట సులభంగా పోల్చి చూసి కొనుగోలు చేయవచ్చు.

Read More...

పూణే ప్లాంట్‌లో డిఫెండర్ 110 అసెంబ్లింగ్ ప్రారంభం : డిఫెండర్ 110 SUV ధరలను భారీగా తగ్గించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్

మహారాష్ట్రలోని పూణే ప్లాంట్‌లో డిఫెండర్ 110ను స్థానికంగా అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించడంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 SUV ధరలను భారీగా తగ్గించింది. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది. దీంతో గతంలో కోటి రూపాయలకు పైగా ఉన్న ఈ SUV ఇప్పుడు రూ.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. యూరప్ కాకుండా డిఫెండర్ 110ను అసెంబ్లింగ్ చేస్తున్న తొలి దేశంగా భారత్ నిలిచింది.  దేశంలో ప్రస్తుతం డిఫెండర్ 110 X-డైనమిక్ HSE వేరియంట్‌ను మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఈ SUV ధరలను కంపెనీ ఇప్పుడు సవరించింది. కొత్త ధరలు చూస్తే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ గతంలో రూ.1.13 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.99 లక్షలకి తగ్గింది. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ గతంలో రూ.1.52 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1.18 కోట్లకి తగ్గింది. 3.0 లీటర్ డీజిల్ గతంలో రూ.1.52 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1.18 కోట్లకి తగ్గింది. 3.0 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఏకంగా రూ.34 లక్షల తగ్గింపు లభిస్తోంది. ఇక 2.0 లీటర్ పెట్రోల్ మోడల్ ధర రూ.14 లక్షలు తగ్గింది. ఈ SUV బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లకు డెలివరీలు నవంబర్ 15, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మూడు ఇంజిన్ ఆప్షన్లలోనూ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉంటాయి. దీంతో రోడ్లపై మాత్రమే కాకుండా కఠినమైన ఆఫ్‌రోడ్ పరిస్థితుల్లోనూ ఈ SUV మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ధర తగ్గింపుతో పాటు 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్‌లో కంపెనీ ఎక్స్ట్రా ఫీచర్లను కూడా అందిస్తోంది. దింతో సుమారు రూ.6.5 లక్షల విలువైన ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సీట్లకు హీటింగ్ & కూలింగ్ సదుపాయాలు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు... ఇక పెద్ద ఇంజిన్ వేరియంట్లలో మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.

Read More...

ట్రయంఫ్‌ ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్‌ 1200 : 2027 మార్చి నుంచి విక్రయాలు

ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో తన అప్‌డేటెడ్‌ టైగర్‌ 1200 శ్రేణి ధరలను ప్రకటించింది. ఇందులో జీటీ ప్రో వేరియంట్‌ ధర రూ.20.99 లక్షలు కాగా, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌ ధర రూ.23.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు మోడళ్లు దేశంలో 2027 మార్చి నుంచి విక్రయానికి రానున్నాయి. ఈ కొత్త బైక్‌లలో ఇంజిన్‌ పనితీరుతో పాటు రైడర్‌ సేఫ్టీ, సస్పెన్షన్‌, కనెక్టివిటీ సదుపాయాలను అప్‌డేట్‌ చేసింది. ఈ బైక్‌లో 1,160 సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను అప్‌డేట్‌ చేశారు. ఇది గరిష్ఠంగా 158 పీఎస్‌ (సుమారు 156 బీహెచ్‌పీ) పవర్‌ని, 130 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్‌ 8 పీఎస్‌ పెరిగింది. తక్కువ ఇంజిన్‌ వేగం వద్దనే మెరుగైన టార్క్‌ అందేలా మార్పులు చేయడంతో నెమ్మదిగా ప్రయాణించే సమయంలోనూ, కఠినమైన రహదారులపై కూడా బైక్‌ను నియంత్రించడం సులభం అవుతుంది. కొత్త టైగర్‌ 1200లో ముందు, వెనుక బాష్‌ రాడార్‌ వ్యవస్థను అందించారు. దీంతో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదంపై హెచ్చరికలు, ఎమర్జెన్సీ బ్రేక్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేకు వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సదుపాయాలున్నాయి. సెమీ యాక్టివ్‌ షోవా సస్పెన్షన్‌, ఆటోమేటిక్‌ ప్రీలోడ్‌ సర్దుబాటు మరో ప్రత్యేకత. బైక్‌ ఆగినప్పుడు సీటు ఎత్తును సుమారు 30 మిల్లీమీటర్లు తగ్గించే వ్యవస్థ కూడా ఉంది. దీంతో భారీ బైక్‌ను నిలిపే సమయంలో రైడర్లకు మరింత సౌకర్యం కలుగుతుంది. జీటీ ప్రోలో 20 లీటర్ల ఇంధన ట్యాంక్‌, కాస్ట్‌ అల్యూమినియం వీల్స్‌, ఏడు రైడింగ్‌ మోడ్‌లు ఉంటాయి. ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌లో 30 లీటర్ల ట్యాంక్‌, స్పోక్డ్‌ వీల్స్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, అదనపు ఇంజిన్‌ గార్డులు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా ఆఫ్‌రోడ్‌ ప్రో మోడ్‌ను కూడా జోడించారు. జీటీ ప్రో బరువు 250 కిలోలు కాగా, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌ బరువు 268 కిలోలు. రెండు మోడళ్లలోనూ ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల చక్రాలున్నాయి. బ్రెంబో స్టైల్మా కాలిపర్లతో కూడిన బ్రేకింగ్‌ వ్యవస్థను అందించారు.

Read More...

ఆరు కీలక టాటా కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్న నోయెల్ టాటా

టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వచ్చే నెల 12న ఆరు కీలక టాటా కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్నారు. అయితే గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డులో ఆయన నామినీ డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సు 70 ఏళ్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీల బోర్డుల నుంచి ఆయన తప్పుకోనున్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐదేళ్ల పదవీకాలాన్ని వ్యతిరేకిస్తూ నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. టాటా సన్స్ సంస్థలో టాటా ట్రస్ట్‌కు 66% వాటా ఉంది.

Read More...

హ్యుందాయ్ బయాన్ లాంచ్

దేశీయ మార్కెట్లో సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ బయాన్'ను లాంచ్ చేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో(ఎక్స్-షోరూమ్) లభించే ఈ కారు.. క్రెటా ధర ఎక్కువ అనిపించే వారికి, వెన్యూ సైజ్ చిన్నదిగా భావించే కొనుగోలుదారులకు సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కేవలం రూ.11,000 చెల్లించి ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ బయాన్ పొడవు 4,245 మిమీ, వెడల్పు 1,810మిమీ, ఎత్తు 1,605 మిమీ, వీల్‌బేస్ 2,600 మిమీగా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 మిమీ. పరిమాణ పరంగా ఇది వెన్యూ కంటే 250 మిమీ పొడవు, కానీ క్రెటా కంటే 85 మిమీ చిన్నది. హ్యాందాయ్ 'ఆర్ట్ ఆఫ్ స్టీల్' డిజైన్ థీమ్‌తో తెరకెక్కిన ఈ కారు ఫ్రంట్ లుక్ హ్యాందాయ్ టుసాన్ మోడల్‌ను పోలి ఉంటుంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌లాంప్ సెటప్, హెచ్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్టైలిష్ బంపర్ క్లాడింగ్ ఇచ్చారు. ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ ఎంపీఐ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 115 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజ్ పరంగా లీటరుకు 18.6 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఈ కారులో ఈకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లతో పాటు ఓవర్ టేకింగ్ వేగాన్ని పెంచే 'డాష్ బూస్ట్ మోడ్', ప్యాడల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి. 2027 జనవరిలో దీని సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా తీసుకురానున్నారు. క్యాబిన్‌లో 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను అందించారు. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. భారతీయ మార్కెట్లో మొదటిసారికి హ్యూందాయ్ కారులో జనరేటివ్ ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌ను అందించడం విశేషం. దీని ద్వారా డ్రైవర్ కారుతో సాధారణ సంభాషణ తరహాలోనే మాట్లాడవచ్చు. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూప్, 70కి పైగా ఫీచర్లతో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 35కు పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360-డిగ్రీ కెమెరా, టీపీఎంఎస్, ఆల్-విల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 12 రాడార్ సెన్సార్లతో కూడిన లెవెల్-2 ADAS ప్రో ప్యాకేజీ లభిస్తుంది. ఈ కారు భారత్ NCAP క్రష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే హ్యుందాయ్ బయాన్‌ను భారత్‌తో పాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లోని 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు హ్యుందాయ్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ వెల్లడించారు.

Read More...

E85, E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాల తయారీ : సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం సవరణలు

దేశంలో సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వాడకాన్ని పెంచేందుకు  E85, E100 ఇథనాల్ ఇంధనాలతో నడిచే ప్రత్యేక వాహనాల తయారీకి మార్గం సుగమం చేస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లో  కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం వాహన తయారీదారులు వంద శాతం ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూల్ వాహనాలను రోడ్లపైకి తీసుకువచ్చేందుకు చట్టపరమైన వెసులుబాటు లభించింది. అయితే.. ఈ కొత్త నిబంధనలు కేవలం రాబోయే కొత్త వాహనాలకే వర్తిస్తాయని, సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న పాత లేదా సాధారణ పెట్రోల్ కార్లలో నేరుగా E100 ఇంధనాన్ని వాడటానికి వీలుండదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మన దేశంలో లభించే సాధారణ కార్లు E20 ఇథనాల్‌ను మాత్రమే తట్టుకోగలవు. కానీ E85, E100 ఇంధనాల కోసం ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల మారుతి సుజుకి సంస్థ దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘మహీంద్రా/మారుతి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ కారు E85 ఇథనాల్‌పై నడిచేలా రూపుదిద్దుకుంది. ఈ రకమైన ఇథనాల్ ఇంధనం సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు దాదాపు రూ. 20 వరకు తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం. అయితే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల కొనుగోలు ధర సాధారణ మోడళ్లతో పోలిస్తే సుమారు రూ. 85,000 వరకు ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతులపై భారత్ చేస్తున్న ఖర్చును తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఇథనాల్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో చక్కెర ఉత్పత్తి, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారీని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ రంగాన్ని పూర్తిగా హరిత ఇంధనం వైపు మళ్లించేందుకు ఈ నిబంధనల సవరణ ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దేశీయ మార్కెట్లో మరిన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read More...

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్‌ విడుదల

దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్). హైపర్‌షిఫ్ట్ క్లాసిక్ 650 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్  కలర్ షిఫ్టింగ్ పెయింట్ ఫినిష్ మాత్రమే కాకుండా ప్రత్యేకమైన వార్షికోత్సవ వివరాలను కలిగి ఉంది. కంపెనీ ఈ స్పెషన్ ఎడిషన్‌ను కేవలం 125 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మోటార్‌సైకిల్ కోసం రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28 వరకు సేల్స్ అందుబాటులో ఉంటాయి. డెలివరీలు నవంబర్ 2026లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివెర్సరీ ఎడిషన్ కన్నీటి చుక్క ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. హైపర్‌షిఫ్ట్ పెయింట్ ఫినిష్ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలే మోటార్‌సైకిల్‌పై కాంతి పడే విధానాన్ని బట్టి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులకు మారుతుంది. ఈ బైకులో 647.95 సీసీ, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,250rpm వద్ద 47 bhp పవర్.. 5,650rpm వద్ద 52.3Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎలక్ట్రిక్ స్టార్టింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read More...

నవంబర్‌ 13న బీవైడీ లగ్జరీ కార్ల బ్రాండ్‌ డెన్జా విడుదల

దేశీయ మార్కెట్లో చైనాకు చెందిన బీవైడీ లగ్జరీ కార్ల బ్రాండ్‌ డెన్జాను నవంబర్‌ 13న పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ.. ఇప్పుడు ఖరీదైన ప్రీమియం కార్ల మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా డెన్జా బ్రాండ్‌ కింద డీ9 లగ్జరీ ఎంపీవీ, జెడ్‌9 జీటీ ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో మూడు వరుసల సీటింగ్ పొజిషన్ ఉండటం వల్ల, ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఎంజీ ఎం9 వంటి లగ్జరీ ఎంపీవీలకు పోటీ ఇవ్వనుంది. అంతర్జాతీయ మార్కెట్లోని ఈ కారు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో 103.36kWh బ్యాటరీ(520 కిమీ రేంజ్)తో లభిస్తోంది. రెండో వరుస సీట్లకు ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్‌మెంట్‌, వెంటిలేషన్‌, మసాజ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. డెన్జా జెడ్‌9 జీటీ స్పోర్టీ డిజైన్‌, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకోనుంది. దీని ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ వెర్షన్‌లో మూడు ఎలక్ట్రిక్‌ మోటార్లు ఉండగా.. అవి 1,156 హెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులోని 122.5kWh బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.  

Read More...

రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్

దేశీయ మార్కెట్లో గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గా నిలుస్తోంది. ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన లుక్ , నగర ప్రయాణాలకు అనువైన పెర్ఫార్మన్స్ తో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు సంప్రదాయ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, మార్కెట్‌కు వెళ్లడం, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటున్నాయి . ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంగా పనిచేసే ఈ స్కూటర్‌లో ప్రయాణ సౌకర్యంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ రహదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని డిజైన్ఈ చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్, శక్తివంతమైన మోటార్, ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 60V , 72V బ్యాటరీ వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి.ఈ స్కూటర్‌లో 1,500W రేటెడ్ పవర్, 2,000 W పీక్ పవర్ కలిగిన BLDC హబ్ మోటార్‌ను అందించారు. కంపెనీ ప్రకారం టాప్ స్పీడ్ 80 kmph .దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతుంది .లిథియం, లెడ్-యాసిడ్ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. లిథియం బ్యాటరీ ఛార్జింగ్‌కు సుమారు 4 గంటలు, లెడ్-యాసిడ్ బ్యాటరీకి సుమారు 8 గంటలు పడుతుంది బ్యాటరీ పెర్ఫార్మన్స్ పర్యవేక్షించేందుకు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంను అందించారు. డిజైన్ పరంగా ట్విన్ ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్స్, LED లైటింగ్, వెడల్పైన టైర్లు, ఆకర్షణీయమైన బాడీ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటాయి. రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, ఎలక్ట్రానిక్ వీల్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ECO ,SMART ,HYPER రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు 220 mm, వెనుక 180 mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక స్ప్రింగ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను అందించారు. 90/90-12 ముందు టైర్, 120/70-12 వెనుక టైర్, 170mm. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ లోడ్ సామర్థ్యం 150 కిలోలు, బ్యాటరీ లేకుండా బరువు 80 కిలోలు. మోటార్‌కు IP66 ప్రొటెక్షన్ రేటింగ్‌ను అందించారు. Army Olive ,Frost White , Blaze Orange ,Glacier Blue ,Lunar Silver ,Sage Green రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.



Read More...

పాతకాలపు లుక్‌, కొత్త ఫీచర్స్ తో డుకాటీ ఫార్ములా 73 విడుదల : ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 బైక్‌లు మాత్రమే తయారు

దేశీయ మార్కెట్‌లో డుకాటీ కొత్త మోడల్‌ ఫార్ములా 73ను విడుదల చేసింది. 1973లో వచ్చిన డుకాటీ 750 సూపర్‌ స్పోర్ట్‌ డెస్మో బైక్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.20 లక్షలు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 బైక్‌లను మాత్రమే తయారు చేయనుండగా, భారత్‌కు కేటాయించిన అన్ని యూనిట్లు ఇప్పటికే బుక్‌ అయిపోయినట్లు సమాచారం. ఈ బైక్‌ను చూస్తే పాతకాలపు రేసింగ్‌ బైక్‌లు గుర్తుకొస్తాయి. సిల్వర్, ఆక్వా గ్రీన్‌ రంగుల కలయికతో ఫ్యూయల్‌ ట్యాంక్‌పై బంగారు రంగు గీతను ఇచ్చారు. క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌బార్లు, బార్‌-ఎండ్‌ మిర్రర్లు, చిన్న ఫెయిరింగ్‌, వెనుకవైపు సన్నగా ఉండే సీటు డిజైన్‌ దీనికి కేఫ్‌ రేసర్‌ లుక్‌ను ఇస్తాయి. ఈ డిజైన్‌ వెనుక డుకాటీ రేసింగ్‌ చరిత్ర ఉంది. 1972లో జరిగిన ఇమోలా రేసులో విజయం సాధించిన 750 ఇమోలా డెస్మో బైక్‌ నుంచి ఈ మోడల్‌కు స్ఫూర్తి లభించింది. ఇందులో 803సీసీ డెస్మోడ్యూ ఎల్‌-ట్విన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 73 హెచ్‌పీ పవర్‌, 65.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్‌ను కూడా అందించారు. స్టీల్‌ ట్రెలిస్‌ ఫ్రేమ్‌, ముందు భాగంలో 41 మి.మీ. కైవైబీ అప్‌సైడ్‌-డౌన్‌ ఫోర్క్‌, వెనుక ప్రీలోడ్‌ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉన్నాయి. పాతకాలపు లుక్‌ ఉన్నప్పటికీ, కొత్త ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కార్నరింగ్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్విక్‌షిఫ్టర్‌, రెండు రైడింగ్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. 4.3 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్‌, ఫుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టం కూడా ఉన్నాయి. అవసరమైతే హీటెడ్‌ గ్రిప్స్‌, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ను అదనపు యాక్సెసరీలుగా పొందవచ్చు. అంటే.. క్లాసిక్‌ డిజైన్‌తో పాటు ప్రస్తుత కాలానికి అవసరమైన టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు.

Read More...

దేశీయ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న హోండా ఎస్‌యూవీ సీఆర్-వీ

దేశీయ మార్కెట్లోకి హోండా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్-వీ మోడల్‌ను మళ్లీ తీసుకురానుంది. భవిష్యత్తులో ఇది కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. గతంలో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ వాహనం, సరికొత్త హంగులతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఆటోమొబైల్ రంగంలో భారీ చర్చ జరుగుతోంది. హోండా సంస్థ తొలిసారిగా 2003లో సీఆర్-వీ కారును భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. ఆ తర్వాత కాలక్రమేణా పలు కొత్త జనరేషన్ మోడళ్లను తీసుకువచ్చింది. అయితే గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో 2020లో ఈ కారు ప్రొడక్షన్ అధికారికంగా ఆగిపోయింది. ఇప్పుడు కంపెనీ CBU మార్గం ద్వారా కొత్త జనరేషన్ సీఆర్-వీని దేశానికి తీసుకురావాలని భావిస్తోంది. ఈసారి అద్భుతమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీలో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు అత్యాధునిక టూ-మోటర్ ఈ-హైబ్రిడ్ సిస్టమ్ లభించనుంది. ఇది సుమారు 204 bhp పవర్, 334 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక లోపలి భాగంలో 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి మోడర్న్ ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు 10 ఎయిర్‌బ్యాగ్‌ల రక్షణ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో హోండా ఎలివేట్, జెడ్ఆర్-వి వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. సీఆర్-వీ రాకతో కంపెనీ స్థానం మరింత బలపడుతుంది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించనుండటం వల్ల దీని ధర కొంత ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది. లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కోరుకునే కస్టమర్లకు ఈ ఎస్‍యూవీ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కారు విడుదలకు సంబంధించి మరిన్ని అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.


Read More...

మధ్యతరగతి మోటార్‌సైకిల్‌ టీవీఎస్ స్పోర్ట్ : లీటర్ కి 70km మైలేజ్

దేశంలో రోజువారీ ప్రయాణాలకు అనువైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా టీవీఎస్ స్పోర్ట్ గుర్తింపు పొందింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారు, ఉద్యోగాలకు వెళ్లేవారు, వ్యాపార అవసరాల కోసం బైక్‌ను ఉపయోగించేవారు ఈ మోడల్‌ను బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు. మంచి డిజైన్, తేలికైన బాడీ, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ వంటివి ఈ బైక్‌కు ప్రత్యేకతను అందిస్తాయి. నగర రోడ్లపై రద్దీ సమయంలో ప్రయాణించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడేలా రూపొందించారు. మైలేజ్,బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను రూపొందించారు.ఈ బైక్‌లోని ఇంజన్, ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పొడవైన సీటు, సర్దుబాటు చేసుకునే వెనుక సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి వి రైడింగ్ అనుభవాన్ని కంఫర్ట్ చేస్తాయి . ఈ బైక్‌లో 109.7 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ఉంటుంది . ఈ ఇంజన్ 6.03 kW పవర్‌@ 7,350 rpm వద్ద, 8.7 Nm టార్క్‌@ 4,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ ఉండటం వల్ల ఇంధన వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ బైక్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌ను అందించారు. రోజువారీ ప్రయాణాలు, ఆఫీసులకు వెళ్లడం, పట్టణ రహదారులపై రైడింగ్ చేయడం వంటి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. మైలేజ్ ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా డిజైన్‌ను అందించారు .ఇది సుమారు 70kmpl మైలేజ్ అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఎలక్ట్రిక్ స్టార్ట్, Econometer, డిజిటల్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌ను అందించారు. బ్రేకింగ్ లో ముందు 130 mm, వెనుక 110 mm డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. SBT సిస్టం బ్రేకింగ్ సమయంలో నియంత్రణను ఇస్తుంది . ఈ బైక్ 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, సుమారు 175mm గ్రౌండ్ క్లియరెన్స్, 790mm సీటు ఎత్తు కలిగి ఉంటుంది. ఈ బైక్ ES, ES Plus వేరియంట్ లలో వస్తుంది.
Read More...

దేశవ్యాప్తంగా మారుతి బ్రెజ్జా 15 లక్షల యూనిట్ల అమ్మకాలు

దేశీయ మార్కెట్లో మారుతి బ్రెజ్జా అరుదైన ఘనతను సాధించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసింది. దాదాపు పదేళ్లుగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న బ్రెజ్జాకు తాజాగా అప్‌డేటెడ్ మోడల్‌ రూపంలో మరింత ఆదరణ లభిస్తోంది. 2026 జూలైలో పరిచయం చేసిన కొత్త బ్రెజ్జాకు లక్షకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఆకర్షణీయమైన డిజైన్, సౌకర్యవంతమైన ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్లు ఈ కారు విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. కొత్త బ్రెజ్జాలో డిజైన్ పరంగా పలు మార్పులు చేశారు. ముందు భాగంలో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌ను అందించారు. వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్ అనే రెండు కొత్త రంగులను కూడా పరిచయం చేశారు. ఇంటీరియర్‌లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జాలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 110 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇప్పటికే ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 103 bhp పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్‌కు 5 స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read More...

భారత్‌లో టెస్లా రోడ్ స్టర్ బుకింగ్స్ ప్రారంభం : రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్

భారత వినియోగదారుల కోసం టెస్లా రోడ్ స్టర్ కారు బుకింగ్ చెల్లింపుల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో థ్రస్ట్ వేరియంట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి మొత్తం రూ.2,50,25,000 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. టెస్లా రోడ్ స్టర్ ను పెర్ఫార్మన్స్, థ్రస్ట్, రాకెట్  అనే మూడు వేరియంట్లలో తీసుకొస్తోంది. వీటిలో ఫీచర్లు, సీటింగ్ సామర్థ్యం, బుకింగ్ విధానంలో తేడాలు ఉన్నాయి. ఈ కారు ఉత్పత్తి 2028లో ప్రారంభం కావచ్చని కంపెనీ తెలిపినట్లు సమాచారం. రోడ్ స్టర్ కు సంబంధించిన బుకింగ్ వివరాల్లో పెర్ఫార్మన్స్, థ్రస్ట్ వేరియంట్లకు వేర్వేరు చెల్లింపు మొత్తాలు ఉన్నాయి. ముఖ్యంగా బుకింగ్ మొత్తం, కారు తుది ధర రెండూ వేర్వేరు అంశాలని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. పెర్ఫార్మన్స్ వేరియంట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి ముందుగా రూ.5.01 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత 10 రోజుల్లో మరో రూ.45.05 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభ చెల్లింపు రీఫండబుల్‌గా పేర్కొన్నప్పటికీ, పూర్తి బుకింగ్ నిబంధనలు, రద్దు విధానం, తిరిగి చెల్లింపు షరతులను అధికారికంగా పరిశీలించడం అవసరం. నిర్ణీత గడువులో మిగిలిన మొత్తం చెల్లించకపోతే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం. Thrust వేరియంట్‌లో Performance ప్యాకేజీతో పాటు అదనపు యాక్సిలరేషన్ థ్రస్టర్లు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి చెల్లించాల్సిన మొత్తం చాలా ఎక్కువగా ఉంది. ప్రారంభ చెల్లింపు రూ.5.01 లక్షలు, 10 రోజుల్లో చెల్లించాల్సిన అదనపు మొత్తం రూ.2,45,24,000, బుకింగ్ మొత్తం: రూ.2,50,25,000. అయితే ఈ మొత్తాన్ని కారు తుది ధరగా పరిగణించకూడదు. భారత మార్కెట్‌లో ఈ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర, పన్నులు, ఇతర ఛార్జీలు, డెలివరీ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి ఖర్చుపై స్పష్టత వస్తుంది. Thrust వేరియంట్‌కు పరిమిత సంఖ్యలో యూనిట్లు అందుబాటులో ఉండవచ్చని, దీని లభ్యత స్థానిక చట్టాలు, నియంత్రణ నిబంధనలపై ఆధారపడుతుందని సమాచారం. కాబట్టి బుకింగ్ చేసుకునే ముందు అన్ని షరతులను నిర్ధారించుకోవాలి. టెస్లా Roadsterను మూడు విభిన్న కాన్ఫిగరేషన్లలో.. ఒక్కో వేరియంట్‌లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. పెర్ఫార్మన్స్ వేరియంట్‌లో ఇద్దరు ప్రయాణించే సదుపాయం ఉంటుంది. యాక్టివ్ ఏరోడైనమిక్స్, మల్టీ-మోడ్ సక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంటున్నారు. మల్టీ-మోడ్ సక్షన్ సిస్టమ్ వాహనానికి అదనపు డౌన్‌ఫోర్స్‌ను అందించే లక్ష్యంతో రూపొందించబడింది. డౌన్‌ఫోర్స్ వల్ల కారు టైర్లకు రహదారిపై మెరుగైన పట్టును అందించడంలో సహాయం లభించవచ్చు. ఈ వేరియంట్‌కు సంబంధించిన మొత్తం బుకింగ్ చెల్లింపు రూ.50.06 లక్షలుగా పేర్కొంటున్నారు. అయితే పూర్తి సాంకేతిక వివరాలు, పనితీరు గణాంకాలు, భారత మార్కెట్‌కు సంబంధించిన తుది స్పెసిఫికేషన్లు ధృవీకరించాల్సి ఉంది. థ్రస్ట్ వేరియంట్‌లో పెర్ఫార్మన్స్ ప్యాకేజీతో పాటు యాక్సిలరేషన్ థ్రస్టర్లు ఉంటాయని కంపెనీ వివరించినట్లు సమాచారం. ఈ ఫీచర్లు సాధారణ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లతో పోలిస్తే దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ఈ వేరియంట్ కోసం మొత్తం రూ.2,50,25,000 బుకింగ్ మొత్తం పేర్కొంటున్నారు. అయితే థ్రస్టర్ సాంకేతికతకు సంబంధించిన పూర్తి వివరాలు, భారత్‌లో దాని వినియోగానికి అనుమతులు, వేరియంట్ లభ్యతను అధికారికంగా ధృవీకరించుకోవాలి. రాకెట్ వేరియంట్ మిగతా రెండు వేరియంట్లకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించగలిగే సీటింగ్ ఏర్పాటుతో పాటు పూర్తి ఫ్లైట్ సిస్టమ్‌ను టెస్లా ప్రస్తావిస్తోంది. ఈ వేరియంట్‌ను సాధారణ బుకింగ్‌కు బదులుగా ఆహ్వానం ద్వారా మాత్రమే అందించే విధానంలో ఉంచినట్లు సమాచారం. భారత మార్కెట్‌కు సంబంధించి దీని బుకింగ్ మొత్తం, తుది ధర, లభ్యత, డెలివరీ తేదీపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. డిజైన్‌లో SR-71, F-35 వంటి విమానాల నుంచి ప్రేరణ పొందిన అంశాలు ఉన్నాయని కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. కారు బాడీ ఆకృతి, కాక్‌పిట్ తరహా క్యాబిన్ డిజైన్ దీన్ని సాధారణ ఎలక్ట్రిక్ కార్ల నుంచి భిన్నంగా చూపించనున్నాయి. అలాగే వాహనంలో SpaceXకు సంబంధించిన కొన్ని భాగాలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రస్తావిస్తోంది. అయితే వాటి పూర్తి జాబితా, ప్రతి వేరియంట్‌లో వాటి వినియోగం, పనితీరుపై ప్రభావం వంటి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.  బుకింగ్ వివరాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వినియోగదారులు కారు డెలివరీ కోసం వేచి చూడాల్సి రావచ్చు. కంపెనీ సమాచారం ప్రకారం ఉత్పత్తి 2028లో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రారంభ దశలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడళ్లను మాత్రమే తయారు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. భారత్‌లో వాహనాల రైట్ హ్యాండ్ డ్రైవ్ అమరిక ముఖ్యమైనది. అందువల్ల భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉండే మోడల్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేశంలో డెలివరీలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Read More...

టెస్లా ఎగిరే కారును ప్రపంచానికి పరిచయం చేసిన ఎలన్ మస్క్

అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్ యాసిలిటీలో నిర్వహించిన ఈ వేడుకలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన తరం రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కార్‌ను టెస్లా సంస్థ అధికారికంగా ప్రదర్శించింది. ఈ కారును ఎలన్ మస్క్  ప్రపంచానికి పరిచయం చేశారు. సాధారణ కార్లలా కాకుండా, సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా రాకెట్ టెక్నాలజీని పోలిన ఫీచర్లతో దీనిని తీర్చిదిద్దడం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కారు అసలు ప్రత్యేకత దాని ఫ్లయింగ్, థ్రస్టర్ సామర్థ్యమే. రాకెట్ సైన్స్ టెక్నాలజీని ఆటోమొబైల్ రంగానికి అనుసంధానిస్తూ, దీనిలో అంతర్గతంగా స్పేస్‌ఎక్స్ కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లను అమర్చారు. ఆవిష్కరణ వేడుకలో భాగంగా ఈ కారు రాంప్ పైనుంచి గాల్లోకి లేచి స్వల్పంగా ఎగరడం, విన్సెంట్లు చేయడం అందరినీ విస్మయపరిచింది. కేవలం గాల్లో తేలడమే కాకుండా, క్షణాల వ్యవధిలో వేగన్ని పుంజుకునే అద్భుతమైన పనితీరును ఇది కలిగి ఉంది. సాంకేతిక పనితీరు పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ కేవలం ఒక సెకన్ వ్యవధిలోనే 0-60 mph వేగాన్ని అందుకునే అసాధారణ యాక్సెలరేషన్ చూపుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ డిజైన్ స్ఫూర్తితో రూపొందించిన ఈ సరికొత్త టూ-సీటర్ స్పోర్ట్స్ కార్ భవిష్యత్ రవాణా రంగ రూపురేఖలను పూర్తిగా మార్చేయగలదనే అంచనాలున్నాయి. రోడ్డుపై ప్రయాణించడంతో పాటు అత్యవసర సమయాల్లో , ప్రత్యేక విన్యాసాల కోసం థ్రస్టర్ల సాయంతో గాల్లోకి లేచేలా దీన్ని డిజైన్ చేయడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలుస్తోంది.

Read More...

మహీంద్రా XUV 3XO సీఎన్‌జీ విడుదల

దేశీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీని లాంచ్ చేసింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలలో అందుబాటులో ఉండే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీ.. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఎంపీఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 114 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 24.7 కి.మీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. 0-60 కి.మీ/గం వేగాన్ని సుమారు 4.9 సెకన్లలో.. 0-100 కి.మీ/గం వేగాన్ని 11.8 సెకన్లలో అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. సేఫ్టీ ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, పటిష్టమైన ఛాసిస్ ఉన్నాయి. 

Read More...

జీప్ రాంగ్లర్ సరికొత్త ఎడిషన్‌ వైట్ క్యాప్ మొజిటో విడుల : భారత మార్కెట్‌కు 25 యూనిట్లు మాత్రమే కేటాయింపు

దేశీయ మార్కెట్లో జీప్ రాంగ్లర్ సరికొత్త ఎడిషన్‌ వైట్ క్యాప్ మొజిటో విడులైంది. దీని ధరను రూ .73.55 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ స్పెషల్-ఎడిషన్ ఆఫ్-రోడర్ ధర దాని బేస్‌ వర్షన్‌ రాంగ్లర్ రూబికాన్ కంటే రూ .1.25 లక్షలు అధికం. లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకువచ్చిన జీప్ రాంగ్లర్ వైట్ క్యాప్ మొజిటో వాహనాలను జీప్ సంస్థ భారత మార్కెట్‌కు కేవలం 25 యూనిట్లను మాత్రమే కేటాయించగా అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. జీప్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 250 యూనిట్ల వైట్ క్యాప్ ఎడిషన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ అక్టోబర్ చివరి నాటికి అధీకృత జీప్ డీలర్ షిష్‌ల ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయనుంది. వైట్ క్యాప్ మోజిటో వాహనం బయట ప్రకాశవంతమైన గ్రీన్‌ 'మోజిటో' షేడ్‌తో పైన వైట్‌ టాప్‌తో వస్తుంది. ముందువైపు గ్రిల్ చుట్టూ వైట్‌ కలర్‌ అంచు ప్రత్యేక ఆకర్షణ. బూట్ మూతపై తెలుపు '4 వీల్ డ్రైవ్' స్టిక్కర్ కనిపిస్తుంది. ఫెండర్లు బాడీ కలర్‌లో ఉంటాయి. ఇంటీరియర్‌ విషయానికి వస్తే.. ప్రామాణిక రూబికాన్‌లో కంటే ఈ స్పెషల్ ఎడిషన్‌లో రెండు ఫీచర్లు మాత్రమే కొత్తగా వచ్చాయి. అవి ఇన్‌బిల్ట్‌ డాష్ క్యామ్, రీన్ఫోర్స్డ్ గ్రాబ్ హ్యాండిల్స్. మిగిలిన క్యాబిన్ లో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్, 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సబ్ వూఫర్ తో 9-స్పీకర్ ఆఫ్‌లైన్ సౌండ్ సిస్టమ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎడిఎఎస్ సూట్ ఉన్నాయి. వైట్ క్యాప్ మొజిటో రూబికాన్ ను పోలి ఉంటుంది. ఇది 2.0-లీటర్, ఫోర్‌ సిలిండర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 272 బీహెచ్‌పీ పవర్‌, 400 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, స్టాండర్డ్ 4x4 సిస్టమ్‌తో వస్తుంది. రూబికాన్‌లో లాగే హెవీ-డ్యూటీ డానా యాక్సిల్స్, ఇంటిగ్రేటెడ్ ఆఫ్-రోడ్ కెమెరా, రీఇన్ఫోర్స్డ్ సస్పెన్షన్, రాక్ రైల్స్, 17-అంగుళాల చక్రాలపై 255-సెక్షన్ ఆఫ్-రోడ్ టైర్లు, హై-క్లియరెన్స్ ఫ్రంట్ ఫెండర్ ఫ్లేర్స్ వంటి ఆఫ్-రోడ్-ఫోకస్డ్ హార్డ్ వేర్‌లు ఉన్నాయి.

Read More...