Tuesday, October 20, 2026

మధ్యతరగతి మోటార్‌సైకిల్‌ టీవీఎస్ స్పోర్ట్ : లీటర్ కి 70km మైలేజ్

దేశంలో రోజువారీ ప్రయాణాలకు అనువైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా టీవీఎస్ స్పోర్ట్ గుర్తింపు పొందింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారు, ఉద్యోగాలకు వెళ్లేవారు, వ్యాపార అవసరాల కోసం బైక్‌ను ఉపయోగించేవారు ఈ మోడల్‌ను బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు. మంచి డిజైన్, తేలికైన బాడీ, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ వంటివి ఈ బైక్‌కు ప్రత్యేకతను అందిస్తాయి. నగర రోడ్లపై రద్దీ సమయంలో ప్రయాణించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడేలా రూపొందించారు. మైలేజ్,బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను రూపొందించారు.ఈ బైక్‌లోని ఇంజన్, ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పొడవైన సీటు, సర్దుబాటు చేసుకునే వెనుక సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి వి రైడింగ్ అనుభవాన్ని కంఫర్ట్ చేస్తాయి . ఈ బైక్‌లో 109.7 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ఉంటుంది . ఈ ఇంజన్ 6.03 kW పవర్‌@ 7,350 rpm వద్ద, 8.7 Nm టార్క్‌@ 4,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ ఉండటం వల్ల ఇంధన వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ బైక్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌ను అందించారు. రోజువారీ ప్రయాణాలు, ఆఫీసులకు వెళ్లడం, పట్టణ రహదారులపై రైడింగ్ చేయడం వంటి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. మైలేజ్ ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా డిజైన్‌ను అందించారు .ఇది సుమారు 70kmpl మైలేజ్ అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఎలక్ట్రిక్ స్టార్ట్, Econometer, డిజిటల్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌ను అందించారు. బ్రేకింగ్ లో ముందు 130 mm, వెనుక 110 mm డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. SBT సిస్టం బ్రేకింగ్ సమయంలో నియంత్రణను ఇస్తుంది . ఈ బైక్ 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, సుమారు 175mm గ్రౌండ్ క్లియరెన్స్, 790mm సీటు ఎత్తు కలిగి ఉంటుంది. ఈ బైక్ ES, ES Plus వేరియంట్ లలో వస్తుంది.