మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ : బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్‌ స్వీప్‌

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్ మెగాన్ షట్ (4-16) బంతితో చెలరేగగా.. అన్నాబెల్ సదర్లాండ్ (74 నాటౌట్), ఎలీస్ పెర్రీ (65 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో సత్తా చాటి ఆసీస్‌ను గెలిపించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను మెగాన్ షట్ పదునైన బౌలింగ్‌తో వణికించింది. ఆమెతో పాటు గార్డ్‌నర్‌ (2-49), సదర్‌ల్యాండ్‌ (2-25) కూడా రాణించడంతో బంగ్లాదేశ్‌ 172 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (54) మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే స్వల్ప ఎదురుదెబ్బలు తగిలినా, ఆతర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. 11 పరుగులకే జార్జియా వాల్‌, 21 పరుగులకే బెత్‌ మూనీ ఔటైనా, ఆతర్వాత వచ్చిన పెర్రీ, సదర్‌ల్యాండ్‌ అజేయ అర్ద శతకాలతో ఆసీస్‌ను విజయతీరాలకు (కేవలం 22.4 ఓవర్లలోనే) చేర్చారు.

Written By

Amateur Full-Stack Developers and Full-Stack UI Designer • Powered by love and coffee • Portofolio on dribbble.com/sanengineer