అక్టోబర్ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు : అంతర్జాతీయ మార్కెట్‌లో 3.5 శాతం తగ్గిన బంగారం ధర

అక్టోబర్ తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో దసరా, ధనత్రయోదశి, దీపావళి వేళల్లో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో పసిడికి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. ఈసారి మాత్రం అనూహ్యంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. అక్టోబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 3.5 శాతం తగ్గింది. వెండి మాత్రం భారీగా తగ్గింది. సిల్వర్ ఏకంగా 14 శాతం వరకు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో శుక్రవారం స్పాట్‌ గోల్డ్‌ ధర 0.2 శాతం దిగొచ్చి 3990 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 0.4 శాతం తగ్గి 50.98 శాతం వద్ద ట్రేడువుతోంది. ఇటు భారత కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1.42 లక్షలు, సిల్వర్‌ ఫ్యూచర్‌ కేజీ ధర రూ.1.87 లక్షల వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1.45లక్షలుగా ఉంది. కిలో వెండి ధర రూ.1.89లక్షలకు చేరింది. నిన్నటితో పోలిస్తే వెండి ధర దాదాపు రూ.5వేలు పతనమైంది. అమెరికా ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడి నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ డిసెంబరులోనూ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే డాలరు బలపడుతుంది. ఫలితంగా అది పసిడి ధరపై ప్రభావం చూపుతుంది. అంటే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి లావాదేవీలు డాలర్లలోనే కొనసాగుతున్న సంగతి తెలసిందే. డాలర్‌ విలువ పెరిగినప్పుడు, ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం, వెండి కొనుగోలు ఖరీదైనదిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పసిడికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అటు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ముడిచమురు బ్యారెల్ కు 112 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాల్లోని ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వల్ప కాలంలో బంగారం ధరలు తగ్గినా దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3