చైనాలో ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

చైనాలో మార్కెట్లో గత ఏడాది విడుదలైన ఐక్యూ నియో 11కు కొనసాగింపుగా ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఇందులో పలు ప్రత్యేక ఫీచర్లను అందించింది. 9,000mAh బ్యాటరీ, 185Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2K సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.  ఐదు స్మార్ట్‌ఫోన్‌లను పలు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేశారు. చైనాలో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. కాంటెస్ట్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికల్లో లభించనుంది.  6.83 అంగుళాల 2K సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1,440 × 3,200 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్ఠంగా 185Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీంతో వేగంగా కదిలే దృశ్యాలు, గేమింగ్ సమయంలో స్క్రీన్ అనుభూతి మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 514 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, HDR సపోర్ట్, 1.07 బిలియన్ రంగులను ప్రదర్శించే సామర్థ్యంతో వస్తుంది. గరిష్ఠంగా 2,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొన్న వివరాల్లో ఉంది. టచ్ రెస్పాన్స్ వేగంగా ఉండేందుకు 5,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా అందించారు. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, వేగంగా స్క్రోల్ చేయడం వంటి పనులకు ఈ డిస్‌ప్లే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 3nm తయారీ ప్రక్రియపై రూపొందిన ప్రాసెసర్. గరిష్ఠంగా 4.6GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ పనితీరు కోసం అడ్రినో 840 GPUను ఇందులో అమర్చారు. గేమింగ్ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక Q3 గేమింగ్ చిప్‌ను కూడా అందించారు. ఈ ఫోన్ 16GB వరకు LPDDR5x Ultra ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో లభిస్తుంది. పెద్ద ఫైళ్లు, గేమ్స్, వీడియోలను స్టోర్ చేసుకోవాలనుకునే వారికి అధిక స్టోరేజ్ వేరియంట్ ఉపయోగపడుతుంది.

Post a Comment

Previous Post Next Post
3