హైదరాబాద్ లోని మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుడికి 1,21,59,801 టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతంనగర్‌లో ఉండే డాక్టర్ (56) ఈ సంవత్సరం ఆగస్టు 11న ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చిన ప్రకటనను చూశాడు. దీనిపై ఆసక్తితో 51 విడతలుగా కొటక్‌మహీంద్ర, ఎస్‌బీఐ ఖాతా నుంచి 1,21,59,801 నగదును బదిలీ చేశారు. అనంతరం లాభాలతో వచ్చిన నగదును విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా వీలుపడటం లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వైద్యుడి నుంచి 1.21 కోట్లను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
byTelugu Lo Computer
•
•
2 min read
