ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జూకర్బర్గ్ కాలిఫోర్నియాను వీడి వెళ్లకుండా ఉండేందుకు మెటా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. కాలిఫోర్నియాలో రాబోయే రోజుల్లో 'ప్రొపోజిషన్ 40' అనే కొత్త వెల్త్ టాక్స్ ప్రతిపాదన ఓటింగ్‌కు రానుంది. ఒకవేళ ఇది గెలిస్తే రాష్ట్రంలోని బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను పడుతుంది. సుమారు 240 బిలియన్ డాలర్ల నికర ఆస్తులున్న జుకర్‌బర్గ్ దీనివల్ల వేల కోట్ల రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది. ఒకవేళ తాను కాలిఫోర్నియాలో ఉంటే తన ఓటింగ్ షేర్లు అమ్మాల్సి వస్తుందని, అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నానని జూకర్బర్గ్ మెటా బోర్డును హెచ్చరించారు. జూకర్బర్గ్ లేకుండా మెటాను ఊహించడం కష్టమని భావించిన కంపెనీ ప్రత్యేక కమిటీ ఆయనతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం జుకర్‌బర్గ్‌కు కొత్తగా ఓటింగ్ హక్కులు లేని క్లాస్-సి షేర్లను మెటా జారీ చేస్తుంది. రాబోయే 8 ఏళ్ల పాటు కాలిఫోర్నియాలోనే నివాసం ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కొత్త షేర్లను అమ్ముకుని జూకర్బర్గ్ తన భారీ పన్ను బిల్లును చెల్లించుకోవచ్చు. దీనివల్ల కంపెనీలో ఆయనకున్న ఓటింగ్ పవర్ ఏమాత్రం తగ్గదు. మెటాపై ఆయన గుత్తాధిపత్యం అలాగే ఉంటుంది. పన్ను సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ జూకర్బర్గ్ కాలిఫోర్నియాను విడిచిపెట్టకుండా మెటా ఈ వినూత్న ఒప్పందంతో అడ్డుకట్ట వేసింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఈ మాస్టర్ డీల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే మరోవైపు ఏఐ రంగంలో దూసుకుపోయేందుకు మెటాకు భారీగా నిధులు అవసరమవుతున్నాయి.
కాలిఫోర్నియాలోనే ఉండేలా మార్క్ జూకర్‌బర్గ్‌తో మెటా క్రేజీ డీల్ !
by Telugu Lo Computer at October 22, 2026
Labels:
" is set to go to a vote in California; if passed
,
"Proposition 40
,
business
,
it would impose a 5% tax on the state’s billionaires
,
Meta’s Bold Deal to Keep Mark Zuckerberg in California
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment