Tuesday, October 20, 2026

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కథా ప్రపంచంతో 'ది ప్రాంప్ట్ వార్ - రైజ్ ఆఫ్ మహావీర్'

దసరా పండుగ సందర్భంగా ఆర్విహా క్రియేషన్స్ సంస్థ తన తొలి చిత్రంగా 'ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్'ని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కథా ప్రపంచంతో ఈ సినిమా రూపొందుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారతీయ పురాణాల్లోని అంశాలకు ఆధునిక సాంకేతికత మేళవిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నరేష్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ప్రసన్న కొత్వాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.