Tuesday, October 20, 2026

ఆసియా పారా గేమ్స్ : భారత స్ప్రింటర్ సిమ్రాన్ కు స్వర్ణం

జపాన్ లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ లో  భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత్ మరో రెండు పతకాలు సాధించింది. మహిళల 200 మీటర్ల టీ-12 పోటీలో భారత స్ప్రింటర్ సిమ్రాన్ స్వర్ణం గెలుచుకుంది. ఇదే ఈవెంట్ లో తేజల్బెన్ దామోర్ కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో మొత్తం భారత పతకాల సంఖ్య 22కు చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి.