Posts

Showing posts with the label 13-Foot Ganesha Idol Made of Pani Puris

పానీ పూరీలతో 13 అడుగుల గణేష్ విగ్రహం : 12,000 తెల్ల శంఖాలతో భారీ గణేశుడి : సోషల్ మీడియాలో వైరల్‌

Image
మ హరాష్ట్రలోని పూణే ఎఫ్‌సీ రోడ్డులో 'గణేశ్ భేల్' నిర్వాహకులు పానీ పూరి బప్పాను ఏర్పాటు చేశారు. ఈ పానీ పూరీ గణేష్ విగ్రహం తయారు చేయడం కోసం సుమారు 21,000 పానీపూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తులో నిర్మించారు. రూపేశ్, దినేశ్ గుడ్మెవార్ అనే ఔత్సాహికులు 2 నెలలు కష్టపడి పానీ పూరీలతో వినాయకుడి రూపానికి ప్రాణం పోశారు. చవితి తొమ్మిది రోజుల పాటు ఈ విగ్రహం పాడవకుండా ఉండేందుకు, దాని భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కళాకారులు నిరంతరం అక్కడే అందుబాటులో ఉంటున్నారు. ఆహార పదార్థాలతోనే కాదు, ఇతర వస్తువులతోనూ వినూత్న విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని కొళత్తూర్‌లో 12,000 తెల్ల శంఖాలను ఉపయోగించి ఓ భారీ గణేశుడి విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఇది కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం, 3.84 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన ఓ విగ్రహం హైదరాబాద్ బేగంబజార్‌లో ప్రతిష్టించారు. గణేష్ విగ్రహాలతో పాటు గణనాథుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం మోదకాల్లోనూ ఈ కొత్తదనం కనిపిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్‌లో ఉన్న 'సాగర్ స్వీట్స్' వారు 'గోల్డెన్ మోదకం...