Posts

Showing posts with the label 068 Units

హైదరాబాద్‌ నగరంలో మందగించిన గృహ విక్రయాలు : 13 శాతం క్షీణించి 26,068 యూనిట్లకు పడిపోయిన విక్రయాలు

Image
హై దరాబాద్‌ నగరంలో గృహ విక్రయాల వేగం మందగించింది. క్రెడాయ్ హైదరాబాద్ - క్రె మ్యాట్రిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (హెచ్‌1 2026 ఆర్థిక సంవత్సరం) నగరంలో ఇళ్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 26,068 యూనిట్లకు పడిపోయాయి. గత 4.5 ఏళ్ల కాలంలో (2022 తర్వాత) ఇదే అత్యల్ప అర్ధవార్షిక విక్రయాల సంఖ్య కావడం గమనార్హం. విక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగలేదు. సగటు ఇంటి విక్రయ ధర గత ఏడాది రూ.1.85 కోట్లుగా ఉండగా, ఈసారి 10 శాతం పెరిగి రూ.2.03 కోట్లకు చేరింది. సగటు ఇంటి పరిమాణం 2,300 చదరపు అడుగులుగా ఉంది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో రూ.52,913 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. బెంగళూరు, ముంబైల తర్వాత దేశంలోనే అత్యధిక విక్రయ విలువ కలిగిన మూడో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచింది. ఐటీ రంగానికి చెందిన అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐల నుంచి వస్తున్న పెట్టుబడులు తగ్గాయి. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రీమియం గృహ విభాగానికి ఆదరణ తగ్గింది. రూ.2 కోట్లకు పైబడిన ఇళ్లను కొనడానికి వేతన జీవులు వెనుకాడడమే కాకుండా అద్దె ఇళ్లక...