Posts

Showing posts with the label $692 million over the next three years

భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం : రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లు

Image
గూ గుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) ఆల్ఫాబెట్ యాజమాన్యం పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. సీఈఓ సుందర్ పిచాయ్ మొత్తం ప్యాకేజీలో ఎక్కువ భాగం (126 మిలియన్ డాలర్లు) పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ ద్వారా వస్తుంది. అదనంగా పిచాయ్ మూడేళ్లలో నెలవారీగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ పొందతారు. వీటితో పాటు ఆయన యాన్యువల్ సాలరీ 2 మిలియన్ డాలర్లను కూడా పొందుతారు. వేమో & వింగ్ ఏవియేషన్ వంటి ఆటోనమస్ విభాగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొత్త స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా గూగుల్ ప్రకటించింది. దీనిద్వారా మొత్తం 350 మిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 2015 ఆగస్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నాయకత్వంలో గూగుల్ మార్కెట్ కాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. కొన్నిసార్లు నాలుగు ట్రిలియన్ డాలర్లను సైతం అధిగమించింది.