Posts

Showing posts with the label during the Haldi Kumkum celebrations

ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు

Image
ముం బైలో బాలికకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ వేధింపులకు ఆరోపణలపై యువకుడికి ప్రత్యేక కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. ఈ ఘటన 2017 జనవరి 31న హల్దీ కుంకుమ్ వేడుకల సందర్భంగా చోటుచేసుకుంది. ఆ సమయంలో బాలిక వయసు 16 సంవత్సరాలు కాగా, నిందితుడి వయసు 19 సంవత్సరాలు అని కోర్టు నమోదు చేసింది. నిందితుడు బాలిక వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం గమనించిన స్థానిక వ్యక్తి ఈ విషయాన్ని బాలిక తల్లికి తెలియజేశారు. అనంతరం తల్లి ప్రశ్నించగా, కొద్ది రోజులుగా నిందితుడు తనను వెంటాడుతున్నాడని, ట్యూషన్‌కు వెళ్లే సమయంలో ఒకసారి వెనుక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగాడని బాలిక తెలిపింది. భయంతో ఈ విషయాన్ని అప్పటివరకు కుటుంబానికి చెప్పలేదని వెల్లడించింది. తర్వాత ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిని హెచ్చరించగా, అతడు దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. విచారణ సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది, నిందితుడు డ్యాన్స్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ సైగ చేశాడని వాదించారు. అయితే కోర్టు, ఈ చర్య బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీసే లైంగిక వేధింపుల కిందకే వస్త...