May 2024

హర్యానాలోని సోనిపట్‌ లోని ఫిరోజ్‌ పూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అపార ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న తరువాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటలపాటు పోరాడారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్‌ లో కనిపించాయి. కర్మాగారం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. 

తిరుమల ఘాట్‌ రోడ్‌లో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు భక్తులతో వెళ్తున్న జీపు రెండో ఘాట్‌రోడ్‌లో ఏడో కిలోమీటరు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘాట్‌రోడ్‌ భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న జీపును పక్కకు తొలగించారు.

ఆయిస్టర్‌ గ్రీన్‌ హైబ్రిడ్‌ వన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 82 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను పొందినట్లు సుజ్లాన్‌ గ్రూప్‌ శుక్రవారం తెలిపింది. 26 విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను సుజ్లాన్‌ ఏర్పాటు చేయనుంది. ఇవి ఒకొక్కటి 3.15 MW రేట్‌ సామర్థ్యంతో మధ్యప్రదేశ్‌లోని అగర్‌ వద్ద ఆయిస్టర్‌ గ్రీన్‌ సైట్‌లో ఏర్పాటు చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందంలో భాగంగా సుజ్లాన్‌ విండ్‌ టర్బైన్స్‌ను సరఫరా చేస్తుంది. కంపెనీ సమగ్ర కార్యకలాపాలు, నిర్వహణ సేవలను కూడా చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు.

రేపు లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్పై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రేపటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తిస్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది.

రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్  'బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్‌ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది. బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ 12,000 బ్రాండ్‌లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్‌ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్‌లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్‌లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్‌స్టాంట్‌ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్‌ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ చెప్పింది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..'మార్కెట్‌లో పేరున్న బ్రాండ్‌లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్‌ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్‌లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు' అని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు నిలిచిపోయాయని చెబుతున్నారు. గూగుల్ సెర్చ్‌, గూగుల్ మ్యాప్స్‌, యూట్యూబ్‌, గూగుల్ న్యూస్, జీమెయిల్‌ వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు యూజర్లు నెట్టింట పోస్ట్‌లు చేస్తున్నారు. క్రౌడ్‌ సోర్ట్స్‌ అవుట్‌టేజ్‌ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌ డౌన్‌ డిటెక్టర్‌ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జీమెయిల్‌తో పాటు గూగుల్ సెర్చ్‌ ఇంజన్‌, మ్యాప్స్‌ వంటి సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. గూగుల్ సేవలకు సంబంధించి వెయ్యికిపైగా నివేదికలు వచ్చాయి. వీరిలో సుమారు 66 శాతం మంది గూగుల్ వెబ్‌సైట్‌తో సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. 21 శాతం మంది గూగుల్ సెర్చ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక మిగిలిన 3 శాతం మంది మ్యాప్స్‌ను యాక్సెస్‌ చేయలేకపోతున్నామని తెలిపారు. వీటితో పాటు గూగుల్‌ న్యూస్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. ఇక గూగుల్‌ సెర్చ్‌లో ఇబ్బందులు వస్తుండంపై పలువురు నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ట్విట్టర్‌లో స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తున్నారు. వీటిలో గూగుల్ సెర్చ్‌ మొదలు, న్యూస్‌ వరకు తలెత్తుతోన్న ఇబ్బందులను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. ఇవాళ సీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జూన్ 2న రాత్రి 11 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. 2వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్ బండ్ పై వెలుగులు విరజిమ్మే క్రాకర్స్, పటాకులు కాల్చుతారని, కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం ధ్యానం చేస్తున్నట్లు ఉందని ఆయన ట్వీట్ చేశారు. దీనికి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో మోడీ చేస్తోంది 'మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్' అంటూ ఓ సెటైరికల్ ఫొటోను జోడించారు. ఇది అన్నింటినీ వివరిస్తుంది! అనే క్యాప్షన్ తో కాంగ్రెస్ నేత చేసిన ఈ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ దరఖాస్తు చేసేవారికి దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్‌ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్‌లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. చెక్ లీఫ్/అటెస్టెడ్‌ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్‌లోడ్‌ చేయని పక్షంలో క్లెయిమ్‌ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు. ఆన్ లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది. డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు. సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధృవీకరిస్తుంది.

తెలంగాణలో  బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంచకుండా సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం వింతగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంటే దేశంలో అత్యున్నత గౌరవం ఉన్న వాళ్ళు, అలాంటి వ్యవస్థను బీజేపీ కించపరచడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని చెప్పారు, ఎందుకు ఇంకా సీబీఐ ఆదేశాలు ఇవ్వలేదు అని మేం ప్రశ్నించారు. నిజంగా బీజేపీ ఆరోపణల్లో నిజం ఉంది అనుకుంటే యాపిల్‌ కంపెనీ పంపించిన మెసేజ్ పై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. సీబీఐతో బీజేపీ తమపై తాము ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బయటికి నటిస్తున్నా.. లోపల కలివున్నారన్నది ఎన్నికల్లోనే స్పష్టం అయిపోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ బీజేపీ అనవసర రచ్చ చేస్తోందన్నారు. ట్యాపింగ్ పై రాష్ట్ర పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. విచారణలో ట్యాపింగ్ దొంగలు బయటపడుతున్నారని.. అసలు దొంగలు త్వరలోనే దొరుకుతారన్నారు. అసలైన దొంగలు బయటపడతారనే భయం బీజేపీకి పట్టుకున్నట్లుందని.. కేసీఆర్, కేటీఆర్ ను కాపాడటానికి బీజేపీ నేతలు ధర్నా లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నప్పుడు సీబీఐ అవసరం ఏముంది..? రాష్ట్ర పోలీసుల మీద బీజేపీ నాయకులకు నమ్మకం లేదా..? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ పేరుతో బ్లాక్ మెయిల్ చేయాలని బీజేపీ భావిస్తుందా..? బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ట్యాపింగ్ పైన కేంద్రం తో ఎందుకు విచారణ జరిపించలేదు..? అని మిడియాముఖంగా నిలదీశారు. ట్యాపింగ్ పైన అప్పట్లో మా రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. మా రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ట్యాపింగ్ తో పాటు కాళేశ్వరం అవినీతి పైన కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేశాం. కేసీఆర్ పైన ఈగ వాలకుండా ఇంత కాలం బీజేపీ కాపాడుకుంటూ వచ్చింది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పైన ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్ తో పాటు అనేక మంది నాయకులు కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని ప్రకటనలు గుప్పించి ఆ తర్వాత మాట్లాడక పోవడానికి కారణం ఏమిటి..? అని అడిగారు. మోదీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందనే తీవ్ర ఆరోపణలున్నాయి. కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ మా నాయకుడు రాహుల్ గాంధీతో పాటు అనేక మంది ఆరోపించారు. దేశం లోని ప్రత్యర్థి రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మోదీ పైన విమర్శలు వచ్చాయి. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు తమ పైన వచ్చిన ఆరోపణల పైన సీబీఐతో విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు. 

మహారాష్ట్రలోని కొంతమంది థియేటర్ ఓనర్స్ కాస్త భిన్నంగా ఆలోచించారు.మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. ముంబయి లోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, ఠాణెలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌,పుణెలోని మూవీమ్యాక్స్‌ తదితర థియేటర్లు జూన్‌ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నారు.ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారట.6 గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారట. ఇందుకోసం టికెట్‌ ధరలు రూ.99 నుంచి మొదలుకొని రూ.300 వరకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది.

మార్చి త్రైమాసికం (జనవరి-మార్చి)లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది. దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది (2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో (జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో స్థూల దేశీయోత్పత్తి  6.2 శాతం నమోదైంది. 2022-23లో 7%గా ఉన్న ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి చెందిందని ఎంఓసీ డేటా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ రేటు 7.7 శాతంగా అంచనా వేసింది. అయితే, NSO రెండవ ముందస్తు అంచనాను కూడా అధిగమించి 2023-24 వార్షిక వృద్ధిరేటు 8.2గా నమోదైంది. తయారీ రంగం బలమైన పనితీరు కారణంగా గత సంవత్సరంలో కన్నా మంచి వృద్ధిరేటు నమోదైంది. 2024 మొదటి మూడు నెలల్లో చైనా 5.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది, అదే కాలంలో భారతదేశం బలమైన ఆర్థిక పనితీరును హైలైట్ చేస్తుంది. 

ఆహారం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ అందులో పోషకాలు మెల్లిగా తగ్గుతాయి. అయితే విచిత్రంగా కొన్ని ఆహారాలలో మాత్రం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ పోషకాలు పెరుగుతాయి.

అన్నం : అన్నాన్ని వండిన మరుసటి రోజుకు పోషకాలు పెరుగుతాయి. నిరోధక కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. ఇది గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది.

చిక్కుళ్లు : నానబెట్టి ఉడికించిన చిక్కుళ్లు రాత్రిమొత్తం అలాగే ఉంచడం వల్ల వాటిలో యాంటీన్యూట్రియెంట్లు తగ్గుతాయి. ప్రోటీన్లు, ఖనిజాల లభ్యత పెరుగుతుంది.

కిమ్చి : కిమ్చి అనేది ఊరగాయ లాంటిది. దీన్ని రాత్రిపూట తయారుచేసి ఉంచితే ప్రోబయోటిక్ లను అభివృద్ది చేస్తుంది. జీర్ణవ్యవస్థకు, గట్ ఆరోగ్యానికి మంచిది.

రొట్టెలు : రొట్టెలు రాత్రిపూట చేసి మరుసటి రోజు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలు సులభంగా గ్రహించేలా చేస్తుంది.

ఉత్తర భారత దేశంలో తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక  ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్ లోని ఔరంగాబాద్ లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు.

కేరళ లోని అలప్పుజ జిల్లా, పజవీడుకు చెందిన విశ్వంభరన్‌ సీఆర్‌పీఎఫ్‌లో పని చేసి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే విశ్వంభరన్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ప్రతి నెల వాటి కోసం 500 రూపాయలు ఖర్చు చేస్తాడు. గత ఐదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ప్రతి సారి 20 టికెట్ల వరకు కొనేవాడు. కానీ ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈసారి అతడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలిచాడు. ఈ సందర్భంగా విశ్వంభరన్‌ మాట్లాడుతూ ''ఏదో ఒకరోజు లాటరీలో గెలుస్తాను అనే ఉద్దేశంతో గత ఐదేళ్లుగా వీటిని కొనుగోలు చేస్తూ వస్తున్నాను. ప్రతి సారి 20 టికెట్లు కొనేవాడిని. కానీ ఈసారి ఇంకా ఎక్కువ టికెట్లు కొనుగోలు చేశాను. వార్తల్లో అలప్పుజ జిల్లాకు చెందిన వ్యక్తి లాటరీ విన్‌ అయ్యాడు అని వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న టికెట్లు బయటకు తీసి చెక్‌ చేసుకున్నాను. ఆశ్చర్యంగా లాటరీలో నేను కొన్న టికెట్‌కే ఫస్ట్‌ ఫ్రైజ్‌ తగిలింది. ముందు నేను నమ్మలేదు. ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకున్నాను. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. లాటరీలో నేను విన్‌ అయ్యాను, 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాను అని తెలిసింది. ఇదంతా దేవుడి దయ. ఈ మొత్తంతో నా అవసరాలు తీర్చుకుంటాను. మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నాను. దీనికన్నా పెద్ద కోరిక నాకేం లేదు'' అని చెప్పుకొచ్చాడు. 

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ సస్పెండెడ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ విధించారు. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తూ ప్రసారం చేసిన ఓ వార్త ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల లిక్కర్ స్కాంకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని అన్నారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా తమ  నాయకుడిపై అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని వార్త కథనాలు ప్రసారం చేయాలని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. కాగా స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

హైదరాబాద్‌ లోని కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా వారిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూవివాదానికి సంబంధించి ఓ కేసును సెటిల్‌మెంట్‌ చేసే విషయంలో కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ బాధితుడిని లంచం అడిగారు. దాంతో బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు వ్యక్తి వద్ద నుంచి సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీతో పాటు కానిస్టేబుల్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ముగ్గురు పోలీసులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోనే విచారిస్తున్నారు. 

రేపు జరగనున్న ఏడో దశ పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుక్షణం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగా దేశవ్యాప్తంగా అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి ఎన్నికల్లో ప్రలోభాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఆదాయ పన్నుశాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి16వ తేదీ నుంచి మే 30వరకు 11 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా. 2019లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బును సీజ్‌ చేయగా ప్రస్తుతం అది అంతకు 182 శాతం ఎక్కువని ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల, లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకల నుంచే సొమ్ము సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఒక్కో రాష్ట్రంలో 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తమిళనాడులో 150 కోట్లకు పైగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశాలలో 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.

తమిళనాడులోని కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం నుంచి ధ్యానంలో కూర్చున్నారు. ఆయన 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మోడీకి అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. మెడిటేషన్ హాల్‌ నుంచి 45 గంటల వరకు ఆయన బయటకు రారు. ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు.

స్ల్పెండర్‌ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘హీరో మోటోకార్ప్‌’ కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘స్ల్పెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0’ పేరిట హీరో మోటోకార్ప్‌ కొత్త వెర్షన్‌ రిలీజ్ చేసింది. ఈ బైక్‌ ధర ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్‌లో రూ.82,911గా ఉంది. గత ఎక్స్‌టెక్‌ వెర్షన్‌తో పోలిస్తే.. ఏ బైక్ ధర రూ.3,000 అధికం. లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సర్వీస్‌ వ్యవధిని 6,000 కిలోమీటర్లకు పెంచింది. కొత్త స్ల్పెండర్‌ 100 సీసీ సింగిల్‌ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఫోర్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో వస్తున్న ఈ బైక్.. 7.09 బీహెచ్‌పీ శక్తి, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మ్యాట్‌ గ్రే, గ్లోస్‌ బ్లాక్‌, గ్లోస్‌ రెడ్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. స్ల్పెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0 డిజైన్‌లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఫీచర్లను మాత్రం అదనంగా ఇచ్చింది. పొజిషన్‌ ల్యాంప్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, వెనక భాగంలో హెచ్‌ ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ ఇచ్చారు. సీటు పొడవు, గ్లవ్‌ బాక్స్‌ పరిమాణాన్ని కాస్త పెంచారు. ఇది డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌తో వస్తోంది. ఎకో ఇండికేటర్‌, రియల్‌-టైమ్‌ మైలేజీ మీటర్, సర్వీస్‌ రిమైండర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్‌ కనెక్టివిటీ (యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌, కాల్స్‌, మెసేజ్‌లు, బ్యాటరీ అలర్ట్స్‌) ఉంటుంది. హజార్డ్‌ స్విచ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంగ్లాండ్ నుండి 100 టన్నుల బంగారాన్ని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లండ్‌లో కాకుండా భారతదేశంలో ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లో మరింత బంగారం భారతదేశానికి తిరిగి రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో 100.3 టన్నుల బంగారాన్ని భారత్‌లో ఉంచగా, 413.8 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది. ఇది కాకుండా, నోట్ల జారీ కోసం భారతదేశంలో 308 టన్నుల బంగారాన్ని ఉంచారు. గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారతీయుల బంగారం నిల్వలు పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ దానిని తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి మరిన్ని బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుంది. సాంప్రదాయకంగా, ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్‌లో ఉంచుతాయి. మన దేశంలో ఇప్పటి వరకు బంగారాన్ని లండన్ లో ఉంచుకునేది. కానీ ఇప్పుడు బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే, నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల కొత్త బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటి. బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది. అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సతీమణి సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయం మహా ద్వారం ముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆలయం ప్రధాన అర్చకులు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి లడ్డు ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. 

మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీపై సినీ దర్శకుడు లూయిట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌహతిలోని హాతీ గౌ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు చేశారు. మోడీ వ్యాఖ్యలు గాంధీని దూషించేలా, పరువు తీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినిమా ద్వారానే మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీశాయి. ఏబీపీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. 1982లో రిచర్డ్ అటెన్‌బరో చిత్రం గాంధీ విడుదలయ్యే వరకు మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదన్నదని మోడీ అన్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన బాలకృష్ణ ఈ వేడుకలో తనదైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ నేహా శెట్టి, అంజలితో స్టేజ్ పై మాట్లాడుతూ అంజలిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్య పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ అంజలి రియాక్ట్ అయ్యింది. అయితే నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరొక్షంగా ట్రోల్స్‏కు చెక్ పెట్టింది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. నాకు, బాలకృష్ణ గారికి ఒకరిపట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలంగా మంచి స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది' అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యతో కలిసి ఉన్న క్లిప్స్ ఓ వీడియోగా మార్చి షేర్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతున్న క్లిప్ కూడా వీడియోలో షేర్ చేస్తూ ట్రోల్స్‏కు చెక్ పెట్టేసింది అంజలి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా నెటిజన్స్ స్పందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో  కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడారని సజ్జలపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ అగ్రనేతలు కౌంటింగ్ ఏజెంట్ల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. "ఇదే మన లక్ష్యం అని భావించి.. దీనికి ఏం అవసరమో తెలుసుకోవాలి.. ఇతరులు (ప్రతిపక్ష పార్టీలు) జోక్యం చేసుకోకుండా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూడండి.. వారు అడ్డుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం చూడాలి. అలా కాకుండా ఒక్క ఓటు కూడా చెల్లుబాటు కాకుండా పోతుందని, ఏదైనా సమస్య వచ్చినపుడు అది రూల్ అని చెప్పి మాట్లాడకుండా వదిలివేయకూడదు. అలాకాకుండా పోరాటం చేసే ఏజెంట్లే కావాలి. ఈ విషయంలో మీరు (ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లు) వారికి (కౌంటింగ్ ఏజెంట్లకు) పోరాటం చేసే విధానం నేర్పాలి. పోరాటం చేయగలిగిన కౌంటింగ్ ఏజెంట్లే మనకు అవసరం. అలా చేయలేని వారు మనకు వద్దు." అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కౌంటింగ్ ఏజెంట్స్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ సజ్జలను అరెస్ట్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఢిల్లీలోఎయిరిండియా విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించింది. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాలిసిన ఎయిరిండియా విమాన ప్రయాణం ఏకంగా 20 గంటలు ఆలస్యం కావడం, 8 గంటల పాటు ఎయిర్ కండిషన్ లేని విమానంలోకూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, నిన్న మధ్యాహ్నం టేకాఫ్ కావాల్సిన శాన్ ఫ్రాన్సిస్కో విమానం 20 గంటల ఆలస్యం తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరనున్నట్టు అధికారులు తెలిపారు.

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జర్మనీ నుంచి బెంగుళూరుకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సిట్ అధికారులు ఆయన ను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసింది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసి విచారణ కోసం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. ఏప్రిల్ 27వతేదీన జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ.. మే 31వ తేదీన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం డీఎల్‌హెచ్ 764 ఏ-359లో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రంలో దిగారు. సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు ఎయిర్ పోర్టులోనే ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు చేశారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ పారిపోయినప్పటి నుంచి ఆయన కోసం సిట్ అధికారులు గాలిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భవిష్యత్‌లో ప్రైవేటు సంస్థల ద్వారా రాకెట్ ప్రయోగాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా.. చెన్నై ఐఐటీ స్టూడెంట్స్ సారథ్యంలో అగ్నికుల్ అనే ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అగ్నిబాణ్‌ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో గురువారం ఉదయం 7గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్‌ రాకెట్‌ను శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రోలో తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించారు. చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్కోస్ స్టార్టప్ సంస్థ భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్య 300 కిలోలలోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ.. ఇస్రోతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఈ రాకెట్‌ను రూపొందించారు. వాస్తవానికి.. ఈ ప్రయోగం ఈ నెల 6న జరగాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. చివరికి.. తాజాగా విజయవంతం కావడంతో అగ్నికుల్ సంస్థ యాజమాన్యంతోపాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా మరో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం దాదాపు 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్‌లోనే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్‌కు పేటెంట్ ఉండగా.. సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు కాగా.. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఐథర్‌నెట్ ఆధారంగా పని చేసే ఏవియానిక్స్ వ్యవస్థను ఉపయోగించారు. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలెట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఈ రాకెట్‌లో పూర్తిగా వినియోగించారు. ఇక.. ఈ ప్రయోగ ప్రక్రియను షార్‌లో పర్యవేక్షించిన ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్.. అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు.

కంప్యూటర్ల రాకతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని అంతా భయపడ్డారు. కానీ, ఇప్పుడు అదే కంప్యూటర్‌ కొత్త పుంతలు తొక్కి లక్షల ఉద్యోగాలు తెచ్చింది. ఇదే మాదిరిగా కృత్రిమ మేధపైనా అపోహలు పెట్టుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. మనిషి మేధస్సుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న ఏఐతో మానవ ప్రమేయం తగ్గిపోతుందా? అంతా టెక్నాలజీయే చూసుకుంటుందా? మరి ఆ టెక్నాలజీని మేనేజ్‌ చేసేవారు ఎవరు?. అనవసర భయాలు, అర్థంలేని అపోహలు కృత్రిమ మేధపై గందరగోళం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐతో లాభమా? నష్టమా అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ కుభేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వంటివారు ఏఐ వల్ల భవిష్యత్​లో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’​ అనే పదమే తప్పని, దానిని ‘డిఫరెంట్​ ఇంటెలిజెన్స్’​గా పిలిస్తే బాగుండేదని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఇన్ఫోసిస్‌ సీటీవో రఫీ తరఫ్​దార్ మాత్రం కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జాబ్​ వరల్డ్​ రెండు విభాగాలుగా నిపుణులు విభజిస్తున్నారు. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటే, మరోదానిలో ఏఐ వినియోగదారులు ఉన్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు విభాగాల్లో సమర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​లేకుండా వచ్చేవాళ్లు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వారికి తక్షణం ఉద్యోగాలు వస్తున్నాయట !. అందుకే ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చివారు ఏఐ సృష్టికర్తలుగా మారాలని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగ ఎంపిక విధానమూ మారినట్లు చెబుతున్నారు. ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లను సగానికిపైగా క్యాంపస్​ వెలుపల నుంచే తీసుకుంటున్నారు. గత నెల ఇన్ఫోసిస్‌ ఇదే విధానాన్ని అమలు చేసింది. ఈ పద్ధతిని అనుసరించేందుకు మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్​లోని 2 లక్షల 50 వేల మంది ఉద్యోగులకు జెన్​ ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. మరోవైపు మిగతా కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులకు ఏఐ సామర్థ్యంపై శిక్షణ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో కృత్రిమ మేధను విరివిగా వాడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో రెండు వేల కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఐతే కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్రవిజ్ఞానం, కంప్యూటర్‌ ప్రోగ్రాములు రాయగల సామర్థ్యాలను విద్యార్థులు అలవర్చుకోవాల్సివుంది. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌లలో కృత్రిమ మేధపై పెద్దఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ పరిశోధలను ప్రారంభించినా యువతలో సామర్థ్యాల పెంచే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంటుంది. అప్పుడే ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునే చాన్స్‌ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగబోవు కౌంటింగ్ కు సంబంధించి సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం, బారికేడింగ్, సెక్యూరిటీ, సీసీటీవీల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గాల వారీగా 14 టేబుల్ లను సక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు భద్రతా సిబ్బంది పర్యవేక్షణతో పాటు సీసీటీవీల పనితీరు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ హాల్లో ఎవరైనా అవాంతరాలు లేదా గొడవలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపటం జరుగుతుందని హెచ్చరించారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి అనుమతులు లేవని, ఈ అంశాలపై జిల్లా ఎస్పీ ఇప్పటికే పలు సమావేశాల ద్వారా పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కలిగించినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోడీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశ్చిమ  బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు.''మేం ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్‌ చేస్తున్నప్పుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?'' అని అన్నారు. 

అధునాతన జే-20 ఫైటర్‌ జెట్లను సిక్కిం సమీపంలోని భారత్‌- చైనా సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది. ఈమేరకు జియో స్పేసియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవహారాలను పరిశీలించే 'ఆల్‌ సోర్స్‌ అనాలసిస్‌' సంస్థ సేకరించిన సమాచారంలో స్పష్టమైంది. మే 27న సంబంధిత సంస్థ శాటిలైట్‌ ద్వారా సేకరించిన చిత్రాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎలాంటి రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా లక్ష్యాలను ధ్వంసం చేయడం జే-20 ఫైటర్‌ జెట్ల ప్రత్యేకత. ఆల్‌సోర్స్‌ అనాలసిస్‌ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే.. షిగేట్సే మిలటరీ ఎయిర్‌పోర్టులో చైనా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 6 జే-20 ఫైటర్‌ జెట్‌లు ఫ్లైట్‌ లైన్‌లో ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే భారత్‌ సరిహద్దులోని కొన్ని లక్ష్యాలను ఛేదించడం చైనాకు తేలిక. దీనిపై భారత వైమానిక దళం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఫైటర్‌ జెట్‌లను మోహరించినట్లు మాత్రం తెలిసినట్లు సమాచారం. జే-20 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌లు చైనాలోనే అత్యంత అధునాతనమైనవి. వీటిని ప్రధానంగా చైనా తూర్పు ప్రావిన్స్‌లో వాడుతారు. తాజాగా టిబెట్‌కు దగ్గరగా వీటిని మోహరించడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణ పరిస్థితులు తలెత్తితే వాటిని భారత్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ దగ్గర 36 రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో 8 విమానాలు ప్రస్తుతం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు అలస్కాలో ఉన్నాయి. షిగేట్సే విమానాశ్రయం పశ్చిమబెంగాల్‌లోని హసిమరా నగరానికి కేవలం 290 కి.మీ. కంటే తక్కువ దూరంలో ఉంది. ఇక్కడే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ క్యాంప్‌ ఉంది. ప్రస్తుతం 16 రఫెల్‌ యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ చైనా ఊహించనివిధంగా దాడికి పాల్పడినా భారత్‌ ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇలా చైనా జే-20 జెట్‌లను మోహరించడం ఇదే తొలిసారి కాదు. భారత్‌ను కవ్విస్తూ 2020- 2023 మధ్య కాలంలో పలుమార్లు యుద్ధ విమానాలను అక్కడ నిలిపింది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో మోహరించడం ఇదే తొలిసారి.

ఓ ఎయిర్ హోస్టెస్  దాదాపు ఒక కేజీ బంగారంతో మే 28న పట్టుబడినట్లు అధికారులు ఈ రోజు వెల్లడించారు. మస్కట్ నుంచి కన్నూర్‌కి అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్‌ని అధికారులు అరెస్ట్ చేశారు. కొచ్చిన్ డీఆర్ఐ వర్గాల ద్వారా వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మస్కట్ నుంచి వచ్చిన, కోల్‌కతాకి చెందిన సురభీ ఖాతున్ అనే క్యాబిన్ సిబ్బందిని అధికారులు అడ్డుకున్నారు. ఆమె తన ప్రైవేట్ పార్టులో (రెక్టమ్)లో 960 గ్రాముల బంగారాన్ని ఉంచి, స్మగ్లింగ్‌కి పాల్పడుతోంది. విచారణ తర్వాత ఆమెను జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్‌లో భాగంగా కన్నూర్‌లోని మహిళా జైలుకు పంపబడింది. ప్రైవేట్ పార్టులో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎయిర్ లైన్ సిబ్బందిని పట్టుకోవడం ఇదే మొదటి కేసు అని అధికారులు చెప్పారు. ఆమె ఇంతకుముందు కూడా చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. స్మగ్లింగ్ ముఠాలోని కేరళకు చెందిన వ్యక్తుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

కర్ణాటకలోని హాసన్ లో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఇండియా నుంచి పారిపోయారు. ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు రానున్నాడు.మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాల్సి వస్తే విమానాశ్రయం నుండే అరెస్టు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ తన ప్లేయబుల్స్ ఫీచర్ ను అందరు యూజర్లకు రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూట్యూబ్ లోనే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేయబుల్స్ సర్వీసును 2023 నవంబర్లో మొదటగా 30 ఆర్కేడ్ గేమ్స్ తో పరిచయం చేశారు. ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో ప్రీమియం సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. కానీ మార్చి 28వ తేదీ తర్వాత దీన్ని అందరు యూజర్లకు ఉచితంగా మార్చారు. ఇప్పుడు దీన్ని ఆడటానికి ఎటువంటి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. ప్లేయబుల్స్ లైవ్ అయిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా బ్లాగ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ‘యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా ఆడగల ఫ్రీ గేమ్స్ కలెక్షన్ ఇది.’ అని బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీన్ని అందరు యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్లేయబుల్స్ సెక్షన్లో వినియోగదారులు 75 గేమ్స్ ఆడగలరు. దీనికి ఎటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే ఈ రోల్ అవుట్ దశల వారీగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది యూజర్లకు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు మాత్రం గేమ్ ట్రే ఐకాన్ కనిపించడం లేదు. దీన్ని బట్టి దశలవారీగా ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని అనుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి పై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రూల్స్, నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లొద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి సీఐకు దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఏజెంట్లను అడ్డుకోమని వైసీపీ ఏజెంట్లకు సజ్జల చెప్పడంపై ఫిర్యాదు ఇచ్చారు. సజ్జలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు సజ్జల కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ డైరెక్షన్‌లో కౌంటింగ్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా సత్రంపాడులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హత్యకు పాల్పడి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఏలూరులో యువతి గొంతుకోసి ఆత్మహత్యకు పాల్పడిన యేసు రత్నం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సత్రంపాడులో యువతి గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన కట్టిబోయిన యేసు రత్నం విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లికి ఒప్పుకోలేదని కారణంతో రత్న గ్రేసీపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సత్రంపాడులోని రత్న గ్రేసీ(22) అనే యువతిని ప్రేమించిన యువకుడు యేసురత్నం(23).. తిరిగి తనను ప్రేమించాలని ఆ యువతి వెంటపడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి తమ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఆ యువతి తల్లిదండ్రులను అడిగాడు. దానికి వారి నిరాకరించడంతో పాటు యువతి కూడా ప్రేమించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సరైన సమయం కోసం వేచి చూసి చివరికి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. యువతిపై కత్తితో దాడి చేసిన తర్వాత తాను కూడా గొంతును కోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా యువకుడు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు కూడా మృతి చెందాడు. 

ఏడో దశ ఎన్నికల ప్రచారం నేడు ముగిసింది. జూన్ ఒకటో తేదీన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ ముగిసిన విషయం తెల్సిందే. ఏడో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో తొమ్మిది, బీహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగు, జార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్‌ జరగనుంది. 

ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను అనుమతించిన న్యాయస్థానం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్‌ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినతిపై శుక్రవారానికల్లా నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీని కూడా మార్చాలని పిన్నెల్లి పిటిషన్‌లో కోరారు.

జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్ కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,447 మంది ఐసెట్‌ కు హాజరు కాగా.. 42,984 మంది (96.71శాతం) అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎ. క్రాంతికుమార్‌ 176.81 మార్కులతో తొలి ర్యాంకు సాధించగా.. గున్నం సాయి కార్తిక్‌ (తూర్పుగోదావరి జిల్లా) రెండో ర్యాంకు, సూరిశెట్టి వసంతలక్ష్మి (విశాఖపట్నం) మూడు, కడపన గణేష్‌ కుమార్‌ రెడ్డి (అనంతపురం) నాలుగు, సామిరెడ్డి తరుణ్‌ కుమార్‌ (విజయనగరం) ఐదో ర్యాంకు సాధించి సత్తా చాటారు. అలాగే, ఎస్‌. దశరథరామరెడ్డి (తూర్పుగోదావరి) ఆరో ర్యాంకులో నిలవగా.. కొర్లం శ్రీకుమార్‌ (శ్రీకాకుళం), పుచ్చా అనుపమ (తూర్పుగోదావరి) ఎనిమిది, దవనబోయన వెంకటేశ్‌ (అనంతపురం) తొమ్మిది, దొరై మునిశేషాద్రి గిరీష్‌ సాయి (చిత్తూరు) పదో ర్యాంకు సాధించారు. 

తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ సింబల్ ను తొలగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడంతో వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాచరికపు పోకడలు, ఫ్యూడల్ అవశేషాలు సమూలంగా తొలగించే చర్యలు ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని కోరారు. ముందుగా ఫ్యూడల్ ప్రతీకలుగా పేర్లలో ఉన్న కుల ఆనవాళ్లు తొలగించాలి. తొలగించుకోవాలి అని పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం ఇలాంటి ప్రతీకలు తెచ్చిందన్నారు. పేరుకు ముందుండే వారసత్వపు ఇంటి పేరు, చివర ఉండే ఆధిపత్యపు కులం పేర్లను తొలగించిందని గుర్తుచేశారు. మరో ట్వీట్ లో మీసం రాచరికపు అవశేషమని, పౌరుషం ప్యూడలిజపు ప్రతి రూపమని దాన్ని కొరిగెయ్యండని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష నిర్వహించారు. నకిలీవిత్తనాల విక్రయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశించారు. సీడ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జిల్లాల వారిగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల ప్రత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5వ తేదీలోగా జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతుల అవసరం మేరకు ప్రత్తి, జిలుగ విత్తనాలు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆ విత్తనాలను జిల్లా కలెక్టర్లు రైతులకు సక్రమంగా చేరేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో వస్తే కౌంటరులు ఎక్కువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకనుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ విత్తనాల విక్రయ కేంద్రాలు, జిలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విత్తన కంపెనీలు ప్రణాళిక ప్రకారం ప్రత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5లోగా జిల్లాలకు చేర్చాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీకి చెందిన ఒకే రకమైన విత్తనాలనే రైతులు కోరుతున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అలా కాకుండా యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒక్కటేనని ఈ విషయాన్ని రైతులందరికీ సంబంధిత కంపెనీలు తెలియజేయాలని సూచించారు. ప్రతిరోజు జిల్లావారి, కంపెనీవారిగా ప్రత్తివిత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలను పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రత్తి మరియు పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని తెలిపారు. రైతుల అవసరం మేరకు విత్తనాలను ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుంచి కొనాలని సూచించారు. రైతులు విత్తనాలకు సంబంధించి ప్రతి కొనుగోలు బిల్లులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదని, అవి మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై విమర్శలు కురిపించారు. ప్రజా పాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని, లోగోను మార్చడం లేదా రాష్ట్ర గీతాన్ని మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడా లేదని, రెండూ ధాన్యం సేకరణ, ఎరువుల సరఫరా, విత్తనాల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా దారి మళ్లింపు వ్యూహాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అలాగే కేసీఆర్ కొడుకు హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడు. కానీ అది అతనికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అని, అదే విధంగా ప్రసిద్ది చెందిందని అన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై  క్లారిటీ ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు.

రేపు పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని, అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, జార్ఖండ్, ఒడిశాలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. తేలికైన, వదులు దుస్తులు ధరించాలని తెలిపింది. అలాగే వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. హీట్‌వేవ్‌ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది 'సైలెంట్‌'గా ఉద్యోగాలు కోల్పోయారు. ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్‌లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను 'సైలెంట్‌ లేఆఫ్‌' విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది. ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్‌ లేఆఫ్‌" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి.

ఒప్పో ప్యాడ్ 2కి కొనసాగింపుగా ఒప్పో ప్యాడ్ 3ని ప్రారంభించేందుకు ఒప్పో సంస్థ సన్నద్ధమవుతోంది. ఒప్పో ప్యాడ్ 3 దాని ముందున్న మోడల్ తో పోలిస్తే 12.1-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది.  పదునైన విజువల్స్ కోసం రిజల్యూషన్ 3K (3000 x 2120 పిక్సెల్‌లు)కి జంప్ అవుతుందని అంచనా వేయబడింది. రిఫ్రెష్ రేట్ మృదువైన 144Hzని తాకవచ్చు. పీక్ బ్రైట్‌నెస్ కూడా 900 నిట్‌ల వద్ద గణనీయంగా మెరుగుపడుతుందని కూడా చెప్పబడింది. ఈ టాబ్లెట్, ఒప్పో ప్యాడ్ 3 తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ప్యాక్ చేయడానికి చిట్కా చేయబడింది, ఇది డిమాండ్ చేసే టాస్క్‌లు మరియు మల్టీ టాస్కింగ్ కోసం శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 16GB RAM మరియు 512GB స్టోరేజీ తో జత చేయబడవచ్చు. ఇందులో యాప్‌లు, గేమ్‌లు మరియు మీడియా కోసం విస్తారమైన స్టోరేజీని అందిస్తుంది. లీక్‌ల సమాచారం ప్రకారం భారీ 9510mAh బ్యాటరీని సూచిస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌పై ఎక్కువ గంటలు పనిచేస్తుంది. ఇందులో, వేగవంతమైన పవర్ డెలివరీ కోసం ఈ టాబ్లెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. డిజైన్ పరంగా, Oppo Pad 3 దాని పూర్వీకుల ఆల్-మెటల్ డిజైన్ నిర్మాణాన్ని నిలుపుకోవచ్చు. ఈ లీక్ "వేలిముద్ర రహిత అన్‌లాకింగ్" వద్ద సూచనలను సూచిస్తుంది, ఇది పేస్ రికగ్నిషన్ భద్రత యొక్క కొన్ని రూపాలను సూచిస్తుంది. ఈ టాబ్లెట్‌లు సాధారణంగా వాటి కెమెరాలకు ప్రసిద్ధి కానప్పటికీ, Oppo Pad 3 ప్రాథమిక వీడియో కాల్‌లు మరియు ఫోటోల కోసం 13-మెగాపిక్సెల్ వెనుక సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ లీక్ ప్రకారం ఒప్పో పెన్సిల్ 2 స్టైలస్‌ తో అనుకూలతను కూడా సూచిస్తుంది. ఇది ఆపిల్ యొక్క తాజా పెన్సిల్ ప్రోలో కనిపించే ఇలాంటి లీనియర్ వైబ్రేషన్ మోటారును కలిగి ఉంటుంది.

3