దేశంలో 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధరతో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.12,000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7080, ముంబైలో రూ.7080, ఢిల్లీలో రూ.7095, కలకత్తాలో రూ.7080, బెంగళూరులో రూ.7080, కేరళలో రూ.7080 వద్ద నేడు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.13,100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7724, ముంబైలో రూ.7724, దిల్లీలో రూ.7739, కలకత్తాలో రూ.7724, బెంగళూరులో రూ.7724, కేరళలో రూ.7724గా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7080గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7724 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7080గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7724 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
3
Beranda › Posts filed under 000 తగ్గింపు
Showing posts with label 000 తగ్గింపు. Show all posts
Showing posts with label 000 తగ్గింపు. Show all posts
వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ అమ్మకాలు ప్రారంభం !
వన్‌ప్లస్ వైబ్‌సైట్‌లో వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. క్రిమ్సన్ షాడో రంగుల్లో లెదర్ ప్యానల్‌తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 64MP కెమెరాను కలిగి ఉంది. కేవలం ఒకే వేరియంట్‌లో లాంచ్ చేశారు. వన్‌ప్లస్ ఒపెన్ అపెక్స్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,49,999 గా ఉంది. వన్‌ప్లస్ వైబ్‌సైట్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌పై స్పెషల్ డిస్కౌంట్‌తో రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.20,000 డిస్కౌంట్ పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ బోనస్‌లో భాగంగా రూ.8000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2268*2440 పిక్సల్ రిజల్యూషన్‌తో 7.82 అంగుళాల 2K ఫ్లెక్సీ ఫ్యూయిడ్ LTPO 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6.31 అంగుళాల 2K LTPO 3.0 సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 అంతర్గత స్టోరేజీ తో ఉంది. 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. Hasselblad బ్రాండ్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 48MP సోనీ LYT T808 CMOS ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 6X ఇన్ సెన్సార్ జూమింగ్‌తో 6X 64MP Omnivision OV648 కెమెరాను కలిగి ఉంది. మరియు 48MP సోనీ IMX581 వైడ్ యాంగిల్ కెమెరానుతో విడుదల చేశారు. 20MP, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 67W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 4805mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ VIP మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ మోడ్ లో కెమెరా, మైక్రోఫోన్ సహా మరికొన్ని ఫీచర్‌లను వినియోగించే అవకాశం ఉండదు. భద్రతపరంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మరియు ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి సెక్యూరిటీ ఫీచర్‌లు ఉంటాయి. 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.3, GPS, Galileo, A-GPS, Glonass, Beidou, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్, గైరోస్కో్ప్, ప్రాక్సిమిటీ సెన్సార్, e-కాంపాస్, ఫ్లిక్ డిటెక్ట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.
కవాసకి డబ్ల్యూ175 బైక్ పై రూ. 25,000 తగ్గింపు !
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ 225 బైక్ లకు పోటీగా కవాసకి డబ్ల్యూ175ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎబనీ, క్యాండీ పెర్సిమన్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ధర రూ. 1.22లక్షల నుంచి రూ. 1.24లక్షలు (ఎక్స్ షోరూం) వరకూ ఉంది. ఈ క్రమంలో కంపెనీ దీనిని అప్ గ్రేడ్ చేసింది. 2024 కవాసకి న్యూ స్ట్రీట్ వెర్షన్ డబ్ల్యూ175గా దీనిని రీలాంచ్ చేసింది. మరో రెండు కొత్త మెటాలిక్ కలర్ ఆప్షన్లలో 2024 మోడల్ ను తీసుకొచ్చింది. గ్రాఫైట్ గ్రే షేడ్ ధర రూ. 1.29లక్షలు, ఓషన్ బ్లూ కలర్ ధర రూ. 1.31లక్షలు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. 2024 కవాసకి డబ్ల్యూ175 స్పోక్డ్ వీల్ వెర్షన్ లో మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు. దీనిలో 177సీసీ సింగిల్ సిలెండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఇది 7000ఆర్పీఎం వద్ద 12.9బీహెచ్పీ, 6000ఆర్పీఎం వద్ద 13.2ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కెర్బ్ వెయిట్ 135కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది బైక్ ని తెలికగా మార్చేసింది. కఠినమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరుని కనబరుస్తుంది. ఈ బైక్ పాత మోడల్లో లాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు వైపు 270ఎంఎం డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. సింగిల్ చానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా ఉంటుంది. కొత్తగా విడుదలైన ఈ బైక్ సీట్ ఎత్తు 790ఎంఎం ఉంటుంది. పాత మోడళ్లతో పోల్చితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ 2024 కవాసకి న్యూ స్ట్రీట్ వెర్షన్ డబ్ల్యూ175లోని స్టాండర్డ్ వేరియంట్ కొనుగోలుపై వినియోగదారులకు రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ను రూ. 1.22 లక్షల (ఎక్స్ షోరూం)కే కొనుగోలు చేయొచ్చు. ఇది ప్రారంభ ధర కాగా.. హై ఎండ్ వెర్షన్ రూ. 1.31లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)