About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 5.935 kg of Ganja Seized. Show all posts
Showing posts with label 5.935 kg of Ganja Seized. Show all posts

5.935 కిలోల గంజాయి పట్టివేత : ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, బ్యాగు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 5.935 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, బ్యాగు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మండలంలోని మైసిగండి ఎంఆర్‌జీ గార్డెన్ సమీపంలో ఎస్‌ఐ బి. చంద్రశేఖర్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో యమహా ఫాసినో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ధనావత్ వెంకటేష్ (26)ను అనుమానంతో అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అతడి వద్ద ఐదు కవర్లలో ఉన్న 5.935 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ వి. సైదిరెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో మత్తు పదార్థాల అక్రమ కదలికలు, విక్రయాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read More...