3

ఒకేరోజూ 23 పైసలు పతనమైన డాలర్‌తో రూపాయి మారక విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత రూపాయి విలువ సోమవారం ఉదయం భారీగా తగ్గింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు క్షీణించి 92.85 వద్ద ట్రేడయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 93.47 వద్ద ప్రారంభమైన రూపాయి.. తొలుత 92.43 స్థాయికి చేరినా, ఆ తర్వాత ఒత్తిడికి లోనైంది. శుక్రవారం రూపాయి వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభపడి డాలర్‌తో పోలిస్తే 70 పైసలు పెరిగి 92.62 వద్ద ముగిసింది. నవంబర్ 13న నమోదైన 94.19 స్థాయి నుంచి గత ఐదు సెషన్లలో రూపాయి విలువ 1.6 శాతానికి పైగా పెరిగింది. అయితే సోమవారం అమెరికన్ డాలర్ బలంగా ఉండటంతో రూపాయి తిరిగి నష్టాలను చవిచూసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.28% తగ్గి బ్యారెల్‌కు 92.38 డాలర్ల వద్ద ట్రేడయింది. డాలర్ ఇండెక్స్ 0.03% క్షీణించి 103.71 వద్ద కొనసాగింది. చమురు ధరలు తగ్గడం తొలుత రూపాయికి కొంత మద్దతిచ్చినా, డాలర్ బలపడటంతో ఆ ఊరట ఎక్కువసేపు నిలవలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు నమోదయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 408.3 పాయింట్లు తగ్గి 83,511.41 వద్ద, నిఫ్టీ 118.90 పాయింట్లు పడిపోయి 25,684.30 వద్ద ట్రేడయ్యాయి. అయితే శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు  నికరంగా రూ.10,308.42 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా నవంబర్ 13తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 14.205 బిలియన్ డాలర్లు తగ్గి 705.342 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు అక్టోబర్‌లో కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 10.9% వృద్ధి చెందింది. బొగ్గు, ఇనుప ఖనిజం, విద్యుత్, సిమెంట్ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధి నమోదవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.

Related Post

Previous
Next Post »