పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకలకు గుర్తుగా ప్రత్యేక నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో సాంకేతిక విద్యా సంస్థల పాత్ర, యువ ఇంజినీర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. దేశ అవసరాలకు కావలసిన ప్రతి పరికరాన్నీ ఇక్కడే ఉత్పత్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ క్రమంలో చిప్ నుంచి షిప్ వరకు అనే నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ తన 100వ వార్షికోత్సవం జరుపుకునే సమయానికి భారత్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడం కోసం నేటి యువత పూర్తి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి చేయాలని, ఇది అందరి బాధ్యత అని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛా భారత్ కోసం దృఢమైన సంకల్పం తీసుకున్నారని, ఆ పట్టుదలతోనే 20 ఏళ్లలో దేశానికి సిద్ధించిందని చెప్పారు. అదే తరహాలో రాబోయే 20 ఏళ్ల కాలంలో వికసిత్ భారత్‌గా మార్చడానికి యువత నిరంతరం శ్రమించాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పిన లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు విశ్రమించకండి" అనే సూక్తిని ప్రధాని ఉదహరించారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ 20 ఏళ్ల కిందటి వరకు నాటి పాలకులు దేశంలో పేదరికాన్ని ఒక శాశ్వత సమస్యగా పరిగణించేవారని, అయిదు దశాబ్దాల క్రితం ఎర్రకోట నుంచి పేదరికాన్ని నిర్మూలించాలని నినాదాలు చేశారని గుర్తు చేశారు. విధానపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడల్లా, వ్యవస్థ మొత్తం కూడా నిష్క్రియంగా ఉండేదని పేర్కొన్నారు. దీన్ని తాము అధిగమించామని చెప్పారు. 13 సంవత్సరాల అతి తక్కువ వ్యవధిలోనే దేశంలో సుమారు 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి వెలుపలికి రావడం చారిత్రక పరిణామమని కొనియాడారు. ఇది ఒక్కసారిగా సంభవించిన మార్పు కాదని, సంకుచిత ఆలోచనలను వీడి సరిహద్దులను చెరిపివేసే మనస్తత్వంతో పనిచేయడం వల్లే సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎన్నో అధిగమించగలిగామని అన్నారు. సవాళ్లకే సవాళ్లు విసరకుండా తాను ఉండలేనన్నారు. దేశంలో సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించిన సమయంలో అనేక విమర్శలు, ప్రతికూల ప్రశ్నలు ఎదురయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. 50 ఏళ్ల క్రితం ఒక సంస్థ సెమీకండక్టర్ల తయారీకి భారత్‌కు రావాలని భావించినప్పటికీ అప్పటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. గతంలో ఆలస్యమైందనే నెపంతో ఇప్పుడు కూడా తాము మౌనంగా కూర్చోలేమని, అందుకే ప్రణాళికాబద్ధంగా తో స్వదేశీ సెమీకండక్టర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోన్నామని తెలిపారు.
3
Beranda
› Move forward with the motto 'From Chip to Ship'
› national
› Prime Minister Narendra Modi at IIT Kharagpur’s Platinum Jubilee celebrations
› unveiled a commemorative coin to mark the occasion
› west bengal
› చిప్ నుంచి షిప్ వరకు అనే నినాదంతో ముందుకెళ్లాలి : ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
Subscribe to:
Post Comments (Atom)
