3

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంటిపై ఈడీ దాడులు

తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంటిపై తెల్లవారుజామున ఈడీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు అధికారుల బృందం ఆమె నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. గతంలో రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ రైస్ మిల్లులో సుమారు 40.96 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిందన్న ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రైస్ మిల్లు అక్రమాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కోణంలోనే ఈడీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లో రేఖా నాయక్‌ను అధికారులు విచారిస్తుండగా, కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇంటి సమీపానికి మీడియాను గానీ, అనుచరులను గానీ పోలీసులు అనుమతించడం లేదు. ఈ దాడుల నేపథ్యంలో ఖానాపూర్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది."

Related Post

Previous
Next Post »