హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ యాజమాన్యంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కుటుంబ ఒప్పందంలో భాగంగా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి వద్ద ఉన్న 43 శాతం వాటాను మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలో 57 శాతం వాటా కలిగి ఉన్న కృష్ణారెడ్డి, ఈ తాజా కొనుగోలుతో మేఘా గ్రూప్‌పై పూర్తి నియంత్రణ సాధించనున్నారు. ఈ భారీ లావాదేవీలతో అంతర్జాతీయ మదుపరులు మేఘా గ్రూప్ విలువను ఏకంగా రూ. 1 లక్ష కోట్లుగా అంచనా వేయడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది. తన మేనమామ పిచ్చిరెడ్డి వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా, కృష్ణారెడ్డి ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల నుంచి 700 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 7,000 కోట్లు సమీకరించారు. అమెరికాకు చెందిన డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ నేతృత్వంలో, వర్డే పార్ట్‌నర్స్ , హిల్‌హౌస్ క్యాపిటల్ వంటి దిగ్గజ ప్రైవేట్ క్రెడిట్ సంస్థలు ఈ భారీ డీల్‌లో భాగస్వాములయ్యాయి. భారతీయ మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేట్ క్రెడిట్ నిధులతో జరుగుతున్న అతిపెద్ద కార్పొరేట్ లావాదేవీలలో ఇది ఒకటిగా నిలిచింది. 1989లో హైదరాబాద్‌లోని బాలానగర్ పారిశ్రామిక వాడలో కేవలం రూ. 5 లక్షల పెట్టుబడితో ఒక చిన్న పైపుల తయారీ వర్క్‌షాప్‌గా పిచ్చిరెడ్డి ప్రారంభించిన ఈ సంస్థ, ఆ తర్వాత కృష్ణారెడ్డి సారథ్యంలో అసాధారణ వృద్ధిని సాధించింది. నేడు సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, సొరంగాలు, విద్యుత్, హైడ్రోకార్బన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ , సిటీ గ్యాస్ వంటి బహుళ రంగాల్లో విస్తరించి 20కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా, కంపెనీకి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ విభాగం విలువను కూడా సుమారు రూ. 14,000 కోట్లుగా మదుపరులు లెక్కగట్టారు. దేశంలో రాబోయే దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఉన్న అపారమైన అవకాశాలను, మేఘా సంస్థకున్న ప్రాజెక్టుల అమలు సామర్థ్యాన్ని గుర్తించే అంతర్జాతీయ సంస్థలు ఈ స్థాయి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెబుతున్నారు.
3
Beranda
› Andhra Pradesh
› business
› Key Ownership Change at Megha Engineering & Infrastructures Limited
› Krishna Reddy to Acquire 43% Stake Held by Pichi Reddy
› telangana
› మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ యాజమాన్యంలో కీలక మార్పు : పిచ్చిరెడ్డి వద్ద ఉన్న 43 శాతం వాటాను కొనుగోలు చేయనున్న కృష్ణారెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
