3

హైదరాబాద్‌ - మంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌ నుంచి మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, ఛత్ పండుగ తర్వాత ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దానాపూర్‌ నుంచి బెంగళూరు కంటోన్మెంట్‌కు రెండు వన్‌ వే స్పెషల్ రైళ్లను కూడా ప్రకటించింది. రైలు నంబర్ 07097 హైదరాబాద్‌-మంగళూరు సెంట్రల్ స్పెషల్ రైలు డిసెంబర్ 2, 2026 నుంచి జనవరి 27, 2027 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. మొత్తం 9 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, రైలు నంబర్ 07098 మంగళూరు సెంట్రల్‌-హైదరాబాద్ స్పెషల్ రైలు డిసెంబర్ 3, 2026 నుంచి జనవరి 28, 2027 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఈ రైలు కూడా మొత్తం 9 సర్వీసులు అందించనుంది. ఈ రెండు రైళ్లు వెళ్లే సమయంలో, తిరుగు ప్రయాణంలోనూ బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట్, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వడకర, తలస్సేరి, కన్నూర్, పయ్యన్నూర్, కాసరగోడ్ స్టేషన్లలో ఆగుతాయి. ఛత్ పండుగ ముగిసిన తర్వాత సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. బీహార్‌లోని దానాపూర్‌ నుంచి బెంగళూరు కంటోన్మెంట్‌ వరకు ఈ రైళ్లు నడుస్తాయి. రైలు నంబర్ 03241 దానాపూర్‌-బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ నవంబర్ 19, గురువారం సాయంత్రం 6 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. నవంబర్ 21, శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 03245 దానాపూర్‌-బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ నవంబర్ 20, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. నవంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు వెళ్లే ఆరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ ఛెవోకి, సత్నా, కట్నీ, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్హార్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పెట్టై, బంగారుపేట్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ వన్‌ వే స్పెషల్ రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.


Related Post

Previous
Next Post »