3

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్ నియామకం

తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బి. ఎం. సందీప్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో బి.ఎం. కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. "కాంగ్రెస్ అధ్యక్షుడు బి. ఎం. సందీప్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు, ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన కాలంలో మీనాక్షి నటరాజన్ అందించిన సేవలను పార్టీ అభినందించింది.

Related Post

Previous
Next Post »