3

విశాఖ 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు : రూ.1,57,607 కోట్ల ఒప్పందాలు

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో దేశ విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సదస్సు మొదటి రోజున మొత్తం 30 ఎంఓయూలు, 5 జీఓ ఎక్స్ఛేంజ్‌లు ద్వారా ఏకంగా రూ.1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపాయి. ఈ మెగా ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 52,956 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీ , ఇన్‌ఫ్రా , ఏరోస్పేస్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ మరియు పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు అత్యంత ఆసక్తి చూపాయి. ఇందులో అత్యధికంగా క్లీన్ మ్యాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ.41,000 కోట్ల భారీ పెట్టుబడితో 600 ఉద్యోగాల కల్పనకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ మూడు వేర్వేరు ఎంఓయూలు రూ.36,000 కోట్లు, రూ.2,300 కోట్లు, ఎక్విప్‌మెంట్ స్కిడ్స్ కింద రూ.1,100 కోట్లు ద్వారా మొత్తం రూ.39,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 12,940 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. లోహ, ఇంధన , టెలికాం రంగాల్లోనూ రికార్డు స్థాయిలో ఒప్పందాలు నమోదయ్యాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ రూ.18,500 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందం చేసుకోగా, రేస్ పవర్ రూ.9,660 కోట్లు , రేస్ ఫ్యూయల్స్ రూ.3,000 కోట్లు , యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ రూ.9,053 కోట్లు - 1,200 ఉద్యోగాలు , రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ రూ.8,500 కోట్లు - 800 ఉద్యోగాలు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటితో పాటు ఫ్యాబ్రిక్ సంస్థ , ఎన్.ఎ.ఎన్ మాగ్నెటెక్ , వెల్‌స్పన్ గ్రూప్ , ఎస్ఎల్ఎన్ కాఫీ , ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ , ఎన్.ఎ.ఎన్ సెలాక్స్ గ్రీన్‌మెట్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇక ఆటోమొబైల్, హెల్త్‌కేర్, ఏరోస్పేస్ మరియు హాస్పిటాలిటీ రంగాల్లోనూ ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడులను ప్రకటించాయి. ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ రూ.1,457 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలకు, ఫైజర్ హెల్త్‌కేర్ ' రూ.983 కోట్లు, ఎంఎన్ఎల్ సొల్యూషన్స్ , బ్లూజెట్ హెల్త్‌కేర్ , ట్రైఫోస్ పవర్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఏరోస్పేస్ రంగంలో రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ రెండు ఒప్పందాల ద్వారా రూ.550 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, సిటోటో డిజిటల్ , డీఎస్ఆర్ హాస్పిటాలిటీ , మానే గ్లోబల్ , ది పార్క్ హోట , ప్రీమియర్ ఎనర్జీస్ , క్లారస్ ఎనర్జీ , రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ , డెల్టాక్స్ సంస్థలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశాయి. ఎంఓయూలతో పాటు ఐదు సంస్థలకు నేరుగా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రాజెక్టులను కేటాయించడం కూటమి ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి అద్దం పట్టింది. ఇందులో ఎం. వెంకటరావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్' రూ.3,078 కోట్ల పెట్టుబడితో 1,300 ఉద్యోగాలకు, జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్స్' రూ.1,533 కోట్లు, రెసల్వెన్ టూ ఎనర్జీ రూ.980 కోట్లు, ఓషిఆర్ గ్రీన్ ఫ్యూయల్స్ రూ.616 కోట్లు, గ్రాండ్ తిరుపతి హోటల్స్ & రిసోర్ట్స్ రూ.188 కోట్ల పెట్టుబడితో 851 ఉద్యోగాల కల్పనకు జీఓలను అందుకున్నాయి. సదస్సు ప్రారంభమైన తొలిరోజే సుమారు లక్షన్నర కోట్లకు పైగా పెట్టుబడులు కార్యరూపం దాల్చడంతో, రెండో రోజున మరిన్ని దిగ్గజ సంస్థలు ఏపీ బాట పట్టడం ఖాయమని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related Post

Previous
Next Post »