భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత ఆయన అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బంజారా భవన్ లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతం అని, ఆయన హయాంలోనే ఐటీఐలకు పునాది పడిందని వివరించారు. ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. సాఫ్ట్వేర్ రంగంతోపాటు పలు విభాగాల్లో ఏఐతో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని, కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐతో చేయలేమని చెప్పారు. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్తులో బ్లూ కాలర్ ఉద్యోగావకాశాలకు కొదవ లేదన్నారు. కాగా, గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని గుర్తు చేశారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అయితే మైనారిటీ రిజర్వేషన్‌ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించిందని, ముందు గుజరాత్లో తొలగించి చూపించాలని తాము సవాల్ విసిరామని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర లేదు.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం అని చెప్పారు. పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లు గడిచినా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు దిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. మైనారిటీ స్కాలర్షిప్లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతితోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని, షబ్బీర్ అలీని సలహాదారుగా నియమించామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని, సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశామని వివరించారు. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది.. పిల్లలను చదివించండి.. నైపుణ్యాన్ని అందించండి అంటూ మీ సోదరుడిగా అండగా ఉంటా.. మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే బాధ్యత నాది అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి అని మైనారిటీలకు పిలుపునిచ్చారు. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
3
Beranda
› CM Revanth Reddy
› Maulana Abul Kalam Azad deserves the credit for formulating the education policy that fostered the nation's educational development
› telangana
› దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
