3

అంతర్జాతీయ డెవలపర్లు ఎక్స్‌పో : హైదరాబాద్‌ గల్ఫ్ గ్లోబల్ ప్రాపర్టీ ఎక్స్‌పోకు మంచి స్పందన

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, మాదాపూర్ పబ్లిక్ కన్వెన్షన్ కేంద్రాలలో యుఏఈ కి చెందిన ఇంచ్ & బ్రిక్, డానుబ్ ప్రాపర్టీస్ వంటి అంతర్జాతీయ డెవలపర్లు ఎక్స్‌పోలను ఏర్పాటు చేసి బహుళ అంతస్తుల విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు , కమర్షియల్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. భాగ్యనగరంలోని ఐటీ నిపుణులు,వ్యాపారవేత్తలు, హెచ్ఎన్ఐలు విదేశీ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఎక్స్‌పోలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దుబాయ్, అబుదాబి రియల్ ఎస్టేట్ రంగాలు పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అసాధారణమైన పన్ను సడలింపులే ఈ ఆకర్షణకు ప్రధాన కారణం. యుఏఈ లో ఆస్తుల కొనుగోలు లేదా అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కానీ ఉండవు. దీనికితోడు వార్షిక అద్దె రాబడి 7 నుండి 10 శాతానికి పైగా వస్తుండటం, నెలకు నిర్ణీత వాయిదాలలో చెల్లించే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లు ఉండటంతో హైదరాబాద్ నిపుణులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను విదేశీ కరెన్సీ లోకి విస్తరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు యుఏఈ ప్రభుత్వం అందిస్తున్న గోల్డెన్ వీసా విధానం కొనుగోలుదారులను మరింత ఆకట్టుకుంటోంది. నిర్దిష్ట విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేసిన వారికి 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం నివసించే వీసాతో పాటు, వారి కుటుంబసభ్యులకు కూడా రెసిడెన్సీ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫలితంగా కేవలం రాబడి కోసమే కాకుండా, విదేశాల్లో సొంత ఇల్లు కలిగి ఉండాలనే కోరిక ఉన్న హైదరాబాదీలకు ఈ ఎక్స్‌పోలు ఒక సువర్ణ అవకాశంగా మారాయి.

Related Post

Previous
Next Post »