3

24 గంటల వ్యాలిడిటీతో రూ. 15కే అన్‌లిమిటెడ్ 5G డేటా

దేశీయ మార్కెట్లోకి రిలయన్స్ జియో తీసుకొచ్చిన రూ. 15 'అన్‌లిమిటెడ్ 5G' 24 గంటల ప్యాక్ తీసుకొచ్చింది. విద్యార్థులు, స్ట్రీమర్లు, గేమర్లు, ప్రయాణికులకు ఎక్కువగా డేటా అవసరమైన రోజుల్లో ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ 24 గంటల వ్యాలిడిటీ సమయంలో ఎలాంటి పరిమితి లేకుండా హై-స్పీడ్ 5G డేటాను అందిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ ప్యాక్ MyJio యాప్, Jio.com వెబ్‌సైట్‌తో పాటు అన్ని ప్రముఖ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందాలంటే మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్, జియో 5G సిమ్ ఉండటంతో పాటు True 5G నెట్‌వర్క్ కవరేజ్ ఏరియాలో ఉండాలి. అంతేకాకుండా మీ నంబర్‌పై ఏదైనా యాక్టివ్ బేస్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ ప్యాక్‌తో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లకు కూడా మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. దీని వ్యాలిడిటీ రీఛార్జ్ చేసిన సమయం నుండి సరిగ్గా 24 గంటల పాటు ఉంటుంది. 

Related Post

Previous
Next Post »