సీఐని ట్రక్కుతో తొక్కించి చంపిన లిక్కర్ మాఫియా

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో లిక్కర్ మాఫియా ఇండోర్-బేతుల్ హైవేపై సీఐని ట్రక్కుతో తొక్కించింది. మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో సీఐతో పాటు సిబ్బంది హైవేపై దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగులు ట్రక్కుతో సీఐ దిలీప్ పూరిని ఢీ కొట్టగా ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సిబ్బంది ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా మద్యం స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందడంతో దిలీప్ పూరి హైవేపై నిఘా పెట్టారు. ఆదివారం రాత్రి హైవేపై మద్యం ట్రక్ రావడంతో ఆపి డ్రైవర్‌ను కిందకు దిగాలని సూచించారు. కానీ డ్రైవర్ ట్రక్కు ఆపకుండా సీఐని తొక్కించి అక్కడ నుండి పరార్ అయ్యాడు. నందల్ పూర్ వరకు వెళ్లిన డ్రైవర్ తరవాత వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3