అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధిస్తే, వారు తీసుకొచ్చే ఏ శాసనాన్నీ ఆమోదించకుండా తన పవర్ ఉపయోగిస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు బిల్లులు పంపితే తన అధ్యక్ష వీటో అధికారంతో తిరస్కరిస్తూ 'మిస్టర్ వీటో'గా మారడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు గెలిచి తమ బిల్లులను పంపినప్పటికీ, తాను నిరంతరం వాటిని వీటో చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకట్రెండు నెలల పాటు వరుసగా వీటోలు ఎదురైన తర్వాత, సమయం దండగ అని గ్రహించి డెమోక్రాట్లే దిగొస్తారని వ్యాఖ్యానించారు. అలా వారిని చర్చల బల్ల మీదికి రప్పించి, తన నిబంధనల ప్రకారం ఒప్పందాలు కుదుర్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా మిడ్ టర్మ్ ఎన్నికల వేళ వెలువడుతున్న పలు సర్వేలు ట్రంప్‌కు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి. ఆయన ప్రజాదరణ తగ్గడం డెమోక్రాట్లకు అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోని కనీసం ఒక సభలోనైనా మెజారిటీ సాధించే అవకాశం డెమోక్రాట్లకు ఉందని, లేదా రెండింటినీ గెలుచుకునే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ట్రంప్ పరిపాలనా రంగానికి ఎదురుదెబ్బ తగిలి, బిల్లుల ఆమోద ప్రక్రియ సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యములోనే ట్రంప్ ఈ ‘వీటో బెదిరింపు’ వ్యాఖ్యల ద్వారా రిపబ్లికన్ ఓటర్లను జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు గట్టి పోటీ ఇస్తున్నాయి.
డెమెక్రాట్లు గెలిస్తే 'మిస్టర్ వీటో'గా మారడానికి కూడా వెనుకాడనని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
byTelugu Lo Computer
•
•
2 min read
