కానిస్టేబుల్ ని బురిడీ కొట్టించి రూ.29 లక్షలు టోకరా వేసిన సైబర్ మోసగాళ్లు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముంటున్న కానిస్టేబుల్‌ శ్రీకాంత్ కు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో సుకన్యరెడ్డి అనే అమ్మాయి పరిచయమైంది. కొద్ది రోజుల స్నేహం తరువాత సుకన్యరెడ్డి శ్రీకాంత్‌ను సంప్రదించి డార్విన్ ఎక్స్ గ్లోబల్ యాప్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో విడతల వారీగా శ్రీకాంత్ రూ. 29 లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నప్పటికీ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మరో రూ.12 లక్షలు కట్టాలని సుకన్యరెడ్డి షరతు పెట్టింది. దీంతో మోసపోయానని గ్రహించిన కానిస్టేబుల్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

Previous Post Next Post
3