మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ హౌరా-కామాఖ్య అందుబాటులోకి రానుండగా, తాజాగా మరో కొత్త వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు నుండి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య ఈ స్లీపర్ రైలు రాకపోకలు సాగించనుంది. బెంగళూరు నుంచి ముంబైకి ట్రైన్ నంబర్ 27652 సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది. ముంబై నుంచి బెంగళూరుకు ట్రైన్ నంబర్ 2765 మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 8:10 నిమిషాలకు ముంబైలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. బెంగళూరు-ముంబై మార్గంలో ఈ రైలుకు మొత్తం 8 స్టేషన్లలో మాత్రమే హాల్ట్ సౌకర్యం కల్పించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్లో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఆ తర్వాత అనంతపురంలో ఆగుతుంది. దీని తర్వాత గుంతకల్లులో హాల్ట్ సౌకర్యం ఉంది. ఈ రెండు స్టేషన్ల అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి (కర్ణాటక), అలాగే షోలాపూర్, పూణె, కల్యాణ్ (మహారాష్ట్ర) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
బెంగళూరు – ముంబై వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
byTelugu Lo Computer
•
•
2 min read
