హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్ ప్లేట్ విజేతగా పాకిస్తాన్ : భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది

హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్ ప్లేట్ ఫైనల్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఒమన్ టీమ్‌ను 18 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్తాన్‌, వరుసగా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సిక్సెస్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అబ్బాస్‌ ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడు ముఖ్యంగా 2వ ఓవర్ వేసిన ఒమన్ బౌలర్ షఫీక్ జాన్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అబ్బాస్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 16 బంతులు ఎదుర్కొన్న ఆఫ్రిది.. 1 ఫోర్‌, 11 సిక్సర్లతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ సమద్‌(32),డనియల్‌(25) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఒమన్ ఓపెనర్లు జోహైబ్ అమానత్(61), ఉస్మాన్ అలీ అఫ్రిది(67) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికి జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.

Post a Comment

Previous Post Next Post
3