మారథాన్‌లో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొని, పరుగు పూర్తి చేసి మెడల్ అందుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొద్ది రేపటి తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఎన్‌ఈబీ సంస్థ నిర్వహించిన మారథాన్‌లో కొమ్మినేని గోపి (36) పాల్గొన్నారు. మణికొండలోని అల్కాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఐబీఎం సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్ అందుకున్న అనంతరం అల్పాహారం కోసం వెళ్తుండగా గోపి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన మారథాన్ నిర్వాహక బృందం ఆయనను చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగా గోపి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మారథాన్‌ను పూర్తి చేసిన ఆనందంలో ఉన్న యువకుడు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం అక్కడ ఉన్న పలువురిని కలచివేసింది.

Post a Comment

Previous Post Next Post
3