About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label karnataka. Show all posts
Showing posts with label karnataka. Show all posts

అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టిన కారు : నలుగురు దుర్మరణం

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై షహాపుర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు మహారాష్ట్ర పరిధిలోని తుల్జాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ భవానీ దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా ఉన్న కారు నేరుగా బ్రిడ్జి పియర్ నిర్మాణాన్ని ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను గురురాజ్ సురేష్ చవాన్ (29), రెడ్డి బాగ్లా రాథోడ్ (33), గోవింద సీత్య చవాన్ (28), కుమార్ రాము రాథోడ్ (26)లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న షహాపుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More...

ఈ20 కార్యక్రమం కాస్తా 420గా మారింది : కేంద్రంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

కర్ణాటకలోని పలు పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువగా ఇథనాల్‌ ఉన్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ20 కార్యక్రమం కాస్తా 420గా మారిందంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల కార్ల నుంచి పెట్రోల్‌ దొంగలించడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ చమురు కంపెనీలు నిర్దేశించిన బ్లెండింగ్ పరిమితిని మించి ఇంధనాన్ని విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటకలోని పలు జిల్లాల నుంచి సేకరించిన ఇంధన నమూనాల ప్రయోగశాల పరీక్షలను ఆయన ఉటంకించారు. బెంగళూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణం, రామనగర, మంగళూరు, తుమకూరుతో సహా పలు ప్రాంతాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్లు రాహుల్‌ వెల్లడించారు. వీటిల్లో ఇథనాల్ గాఢతలు 31.2 శాతం, 30.5 శాతంగా నమోదయ్యాయని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించిన మొత్తం 14 నమూనాలలోని 11 నమూనాల్లో 20 శాతానికి పైగా ఇథనాల్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇంధన ట్యాంకులలో ఏమి నింపుతున్నారనే విషయాన్ని ఇప్పటికైనా తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. 20శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇటువంటి విధానాల వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత నిలదీశారు. కర్ణాటకలో ఈ-20 పేరిట 30 శాతం ఇథనాల్‌ కలిసిన ఇంధనాన్ని విక్రయిస్తున్నారని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌ శుక్రవారం ఆరోపించారు. దీంతో ఈ విషయంపై రాజకీయ దుమారం రేగింది. అయితే పెట్రోల్‌లో ఇథనాల్‌ పరిమాణం ఎక్కువగా ఉందని కర్ణాటక ప్రభుత్వం వాదించడాన్ని కేంద్ర పెట్రోలియం సంస్థలు, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ సంయుక్తంగా తోసిపుచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష ప్రామాణికత సరికాదని తేల్చిచెప్పాయి. కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల సంస్థ నిబంధనల మేరకు ఇథనాల్‌ 19- 21శాతం మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించాయి.

Read More...

భార్య, ఆమె బంధువులతో సహా ఏడుగురిని రోకలిబండతో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

బెంగళూరులోని రాజాజీనగర్ పరిధిలో  కుటుంబంలో తలెత్తిన విభేదాలతో క్యాబ్ డ్రైవర్ శేఖర్ ఏడుగురిని చంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య, ఆమె కుటుంబాన్ని చంపిన శేఖర్ తర్వాత మృతదేహాన్ని మాయం చేశాడు. ఒకరి తర్వాత ఒకరిని రోకలిబండతో కొట్టి శేఖర్ చంపినట్లు గుర్తించారు. కుటుంబ కలహాలు, భార్య వైపు వారు తమ సంసారంలో జోక్యం చేసుకుంటున్నారనే కక్షతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ నరమేధానికి సంబంధించి నిందితుడైన ఇందు శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భార్య సునీత, అత్త రూపవతి, బావమరుదులు శివకుమార్, శంకర్, తోటికోడళ్లు దివ్య, నలిని, అలాగే శంకర్ కుమారుడైన ఏడేళ్ల బాలుడు పునీత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఇందు శేఖర్ పక్కా ప్లాన్ ప్రకారం రెండు రోజుల వ్యవధిలో ఒక్కొక్కరిని తన ఇంటికి పిలిపించి రోకలిబండతో మోది దారుణంగా హతమార్చాడు. మొదట భార్యను చంపి, ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులను పార్టీ పేరుతో పిలిపించి అంతమొందించాడు.హత్యల అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను కెమికల్స్ ఉపయోగించి క్లీన్ చేశాడు. శవాలను తన క్యాబ్ కారులో తరలించి చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు లోయల్లో పడేసాడు. నిందితుడి బంధువుల్లో ఒకరైన నళిని కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇందు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సామూహిక హత్యల గుట్టు రట్టయింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలాలకు తీసుకెళ్లి మృతదేహాల రికవరీ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మిగిలిన వారి దేహాల కోసం గాలిస్తున్నారు.పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 

Read More...

మిచిగాన్ సెనేట్‌లో తొలి ముస్లిం సభ్యుడిగా డాక్టర్ అబ్దుల్ ఎల్-సయ్యద్ ఎన్నిక !

అమెరికాలోని మిచిగాన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్దుల్ ఎల్-సయ్యద్ (42) ఘనవిజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను ఓడించడం ద్వారా యూఎస్ సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం సభ్యుడిగా ఎల్-సయ్యద్ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురైన వ్యక్తిగత తీవ్ర విమర్శలను సైతం తట్టుకుని ఆయన విజయం సాధించడం గమనార్హం. అబ్దుల్ ఎల్-సయ్యద్ విజయంతో కర్ణాటకలోని తీర ప్రాంత పట్టణం భట్కల్, రాజధాని బెంగళూరులో పండుగ వాతావరణం నెలకొంది. అబ్దుల్ ఎల్-సయ్యద్ భార్య డాక్టర్ సారు జుకాకు కుటుంబ మూలాలు భట్కల్‌లోనే ఉన్నాయి. సారా తాతయ్య జుకాకు షంషుద్దీన్ పూర్వపు మైసూర్ రాష్ట్రంలో బీడీ జెట్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రిగా సేవలందించారు. సారా బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మిచిగాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో రోడ్స్ స్కాలర్ అయిన ఎల్-సయ్యద్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. తన భార్య తరఫు దక్షిణాది భారతీయ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఎల్-సయ్యద్ పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అబ్దుల్ ఎల్-సయ్యద్ మాట్లాడుతూ "నేను 20 ఏళ్లుగా దక్షిణాది భారతీయ కుటుంబంతో వివాహ బంధంలో ఉన్నాను. నా అరబ్ మూలాల కంటే నేనే ఎక్కువగా భారతీయుడినేమో!" అని పేర్కొనడం ఆయన భారతీయ సంబంధాన్ని చాటిచెబుతోంది. మిచిగాన్ సెనేట్ ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రధాన అంశంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలను నిరభ్యంతరంగా అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని అబ్దుల్ ఎల్-సయ్యద్ తీవ్రంగా నిరసించారు. గాజాలో జరుగుతున్నది మానవహక్కుల ఉల్లంఘనేనని ఆయన గళమెత్తారు. దీనిపై రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగి అబ్దుల్ ఎల్-సయ్యద్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అబ్దుల్ ఎల్-సయ్యద్‌కు ఇజ్రాయెల్, యూదులంటే ద్వేషమని ట్రంప్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అబ్దుల్ ఎల్-సయ్యద్ ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని, యూదుల పట్ల వ్యతిరేకతగా భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ రోజర్స్ ఇద్దరూ ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు మద్దతు ఇస్తూ అబ్దుల్ ఎల్-సయ్యద్‌ ను టార్గెట్ చేసినప్పటికీ.. మిచిగాన్ ఓటర్లు మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్ వైపే మొగ్గు చూపి రికార్డు విజయాన్ని కట్టబెట్టారు.

Read More...

బెంగళూరు – ముంబై వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-కామాఖ్య అందుబాటులోకి రానుండగా, తాజాగా మరో కొత్త వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు నుండి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య ఈ స్లీపర్ రైలు రాకపోకలు సాగించనుంది. బెంగళూరు నుంచి ముంబైకి ట్రైన్ నంబర్ 27652 సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది. ముంబై నుంచి బెంగళూరుకు ట్రైన్ నంబర్ 2765 మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 8:10 నిమిషాలకు ముంబైలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. బెంగళూరు-ముంబై మార్గంలో ఈ రైలుకు మొత్తం 8 స్టేషన్లలో మాత్రమే హాల్ట్ సౌకర్యం కల్పించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఆ తర్వాత అనంతపురంలో ఆగుతుంది. దీని తర్వాత గుంతకల్లులో హాల్ట్ సౌకర్యం ఉంది. ఈ రెండు స్టేషన్ల అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి (కర్ణాటక), అలాగే షోలాపూర్, పూణె, కల్యాణ్ (మహారాష్ట్ర) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

Read More...

బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాలలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి? : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘X’లో పోస్ట్‌

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో బ్యాలెట్ పత్రాల ద్వారా శాసన మండలి ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పనితీరుపై ‘X’ పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగాయని ప్రధానమంత్రి  హైలైట్ చేస్తూ, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందని ప్రశ్నించారు. “నాలుగు పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు కర్ణాటకలలోని 28 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?” అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఆ పోస్ట్‌లో మోనోకిల్ ఉన్న ముఖం ఎమోజీని కూడా ఉపయోగించారు.

Read More...

అదుపుతప్పి చెరువులోని బురదలోకి దిగబడిపోయిన కారు : ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

కర్ణాటకలోని కొడగు జిల్లా మడికెరి తాలూకా మాల్యారె పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్‌ (36), ఆయన భార్య ప్రమిత (34), చిన్న కూతురు లియ (4) ఈ దుర్ఘటనలో మృతి చెందారు. విజేశ్ దంపతులు తమ కారులో మాల్యారెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని ఉంచి, చిన్న కూతురు లియను వెంటబెట్టుకుని తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు తిరిగి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో చెరువు కట్టపై వెళ్తుండగా, కారు అకస్మాత్తుగా అదుపుతప్పి కిందకు జారిపోయి చెరువులోని బురదలోకి దిగబడిపోయింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం బయటపడలేకపోయారు. కారులోనే ఊపిరాడక వారు ముగ్గురూ ప్రాణాలు వదిలారు. ఉదయం ఆ దారిన వెళ్తున్న కొందరు కార్మికులు చెరువులో కారును గమనించి, వెంటనే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు. కార్మికులు కారులోని వారిని బయటకు తీసి సిద్ధాపుర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చె­ందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడికెరి ఆస్పత్రికి తరలించారు.

Read More...

మైసూర్ దసరా ఉత్సవాల్లో మొదటిసారిగా పాల్గొన్న తమిళనాడు కళాకారులు

దాదాపు 400 సంవత్సరాలకు పైగా చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో అత్యంత కీలకమైన భారీ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళా బృందాలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం జరిగిన దసరా ఊరేగింపు కార్యక్రమంలో చరిత్రలోనే మొదటిసారిగా తమిళనాడుకు చెందిన ఒక సాంస్కృతిక కళా బృందం అధికారికంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల్లో పాల్గొన్న తమిళనాడు కళాకారులు తమ అద్భుతమైన, ఉత్సాహపూరితమైన ప్రదర్శనలతో వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. శతాబ్దాల సంప్రదాయం కలిగిన మైసూర్ దసరా పరేడ్‌లో తమిళ కళా బృందానికి లభించిన ఈ ఘనమైన ఆహ్వానం, గుర్తింపునకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More...

నవంబర్ 1 నుంచి బెంగళూరు - ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ?

బెంగళూరు, ముంబై నగరాల మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా నవంబర్ 1న ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, నవంబర్ 2 నుంచి సాధారణ సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రారంభ తేదీ, షెడ్యూల్, టికెట్ ధరలను రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ప్రతిపాదిత రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడిచే అవకాశం ఉంది. దేశ సాంకేతిక కేంద్రంగా పేరొందిన బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై మధ్య ప్రతిరోజూ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వేగవంతమైన రాత్రిపూట రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే వారికి ప్రయోజనం కలగనుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, బెంగళూరు నుంచి రైలు రాత్రి 7:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రయాణానికి సుమారు 16 గంటల 5 నిమిషాలు పట్టవచ్చని అంచనా. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 8:10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు బెంగళూరు చేరుకోవచ్చు. ఈ సర్వీసు వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇవి ప్రతిపాదిత సమయాలు మాత్రమే. వందే భారత్ స్లీపర్ రైలు స్టాపేజీలు: ఈ రైలు మార్గమధ్యంలో ఏడు స్టేషన్లలో ఆగే అవకాశం ఉంది. అనంతపురం, గుంతకల్ జంక్షన్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పూణే జంక్షన్, కళ్యాణ్ జంక్షన్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్టాపేజీలకు సంబంధించిన తుది వివరాలను రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. అధికారిక టైమ్‌టేబుల్ విడుదలైన తర్వాత ప్రతి స్టేషన్‌లో రైలు రాకపోకల సమయాలపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం బెంగళూరు-ముంబై మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ సుమారు 1,134 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి దాదాపు 22 గంటలు తీసుకుంటుంది. మరోవైపు, ప్రతిపాదిత వందే భారత్ స్లీపర్ సుమారు 1,118 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల 5 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని అంచనా. ఈ సమయాలు ఖరారైతే, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే దాదాపు ఆరు గంటలు ఆదా కావచ్చు. అయితే, వాస్తవ ప్రయాణ సమయం తుది షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రైలులో 16 కోచ్‌లు, మొత్తం 823 బెర్తులు ఉంటాయని అంచనా. వీటిలో 11 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లలో 611 బెర్తులు, నాలుగు ఏసీ టూ-టైర్ కోచ్‌లలో 188 బెర్తులు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో 24 బెర్తులు ఉండవచ్చని సమాచారం. దీనివల్ల ప్రయాణికులు తమ బడ్జెట్, సౌకర్యాలకు అనుగుణంగా బెర్తులను ఎంచుకోవచ్చు. అయితే, ఈ కోచ్‌ల వివరాలు కూడా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

Read More...

బెంగళూరు సిటీలోకి పీక్ అవర్స్‌లో గూడ్స్ వాహనాలకు నో ఎంట్రీ

బెం
గళూరులో ప్రధాన వాణిజ్య కేంద్రమైన కేఆర్ మార్కెట్, దాని పరిసర ప్రాంతాలలో రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. నగరం లోపలి అత్యంత రద్దీగా ఉండే అవెన్యూ రోడ్డుపై వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పాదచారుల భద్రతను పెంచడానికి ఒక సరికొత్త సమగ్ర రవాణా నిర్వహణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదనలలో భాగంగా రద్దీ సమయాల్లో ప్రధాన మార్గాల్లో ప్రయాణించే సరుకు రవాణా వాహనాలపై కఠినమైన నిబంధనలు విధించాలని యోచిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు, వ్యాపారులు, పాదచారుల రాకపోకలకు ఎలాంటి అవరోధం కలగకుండా ఉండేందుకు, సరుకు రవాణా వాహనాలను కేవలం రాత్రి వేళల్లో మాత్రమే అనుమతించే అంశాన్ని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. పగటిపూట నిత్యం వేలాది మంది కొనుగోలుదారులు వచ్చే ఈ మార్గంలో సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియల వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. దీనికితోడు ప్రాథమిక నియంత్రణ చర్యల్లో భాగంగా అవెన్యూ రోడ్డులోకి ఆటో-రిక్షాలు, తోపుడు బండ్ల ప్రవేశాన్ని ఇప్పటికే పాక్షికంగా పరిమితం చేశారు. ప్రస్తుతం అక్కడ రహదారిపై ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి, నిబంధనలను పర్యవేక్షించడానికి అదనపు ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోయే ఈ వీధిలో వ్యాపారులకు అసౌకర్యం కలగకుండా చూస్తూనే, స్థానిక రవాణాను ఎలా క్రమబద్ధీకరించాలనే దానిపై పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రతిపాదిత సమయాలు, కొత్త విధానంపై నిర్ణయం తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు, గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు, స్థానిక శాసనసభ్యులతో  కీలక సంప్రదింపులు జరిపారు. సరుకు రవాణా వాహనాలను వ్యాపార వేళల్లో పూర్తిగా నిషేధించాలా లేక నిర్దిష్టమైన కొన్ని సమయాల్లో మాత్రమే అనుమతించాలా అనే దానిపై స్థానిక వర్తక సంఘాలతో కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా సరికొత్త నిబంధనావళిపై త్వరలోనే అధికారిక తుది నిర్ణయం తీసుకోనున్నారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి కమాండ్ సెంటర్ ద్వారా సీసీటీవీ పర్యవేక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిగ్నల్ వ్యవస్థలు మరియు మైక్రో-మేనేజ్‌మెంట్ పద్ధతులను బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ శాఖ వేగవంతం చేస్తోంది. కేఆర్ మార్కెట్, అవెన్యూ రోడ్డు ప్రాంతంలో ఈ కొత్త మోడల్ విజయవంతమైతే, నగరంలోని మిగిలిన రద్దీ వాణిజ్య వీధుల్లో కూడా ఇటువంటి సరుకు రవాణా నియంత్రణలను విస్తరించే అవకాశం ఉందని రవాణా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read More...

ప్రేమ వేధింపులకు బలైన విద్యార్థిని

కర్ణాటకలో ప్రేమించాలని వేధించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూళగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు సూళగిరి తాలూకా ఏనుసోణ సమీపంలోని ఎం.దొడ్డి గ్రామానికి చెందిన వీరేంద్రన్‌ కూతురు పవిత్ర (17) సూళగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ టూ  చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నితీష్‌ కుమార్, శ్రీధర్‌ బాలిక వెంటపడి ప్రేమించాలని ఒత్తిడి చేశారు. ఇటీవల పవిత్ర ఇంటి వద్దకు వెళ్లిన నితీష్‌ కుమార్‌.. రహస్యంగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. విషయాన్ని పసిగట్టిన పవిత్ర తల్లి బయటకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పవిత్ర ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం సూళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.

Read More...

దర్శన్‌ బెయిల్‌ కోసం అభిమానులు రాష్ట్రపతికి లేఖ

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు అతడి అభిమానులు మద్దతుగా నిలబడ్డారు. దర్శన్‌కు త్వరగా బెయిల్‌ దొరకాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును మానవతా దృక్పథంతో విచారించాలని కోరుతూ దర్శన్‌ అభిమానులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని పేదలు, ఆదివాసీలు, బాధితుల 9రపున నిలిచిన కరుణామయి తల్లిగా లేఖలో అభివర్ణించారు. సంకష్టంలో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ ఆరోగ్యం, కుటుంబం అతడిని నమ్ముకుంది. అభిమానుల భావాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. దర్శన్‌కు చట్టం ప్రకారం న్యాయం దొరికేలా చూడాలి. దర్శన్‌ను సత్వరంగా విడుదల చేయాలని రాష్ట్రపతికి దర్శన్‌ అభిమానులు మనవి చేశారు.

Read More...

జూరాల ప్రాజెక్టుకు అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుండి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు అంగీకరించారు. దీనికోసం రేవంత్ రెడ్డి స్వయంగా డీకే శివకుమార్ కు ఫోన్ చేశారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు అనుకూలించట్లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువులు, కుంటలలో నీటి మట్టాలు గణనీయంగా అడుగంటాయి. పచ్చని పైర్లు కళ్లముందే ఎండిపోతున్నాయి. చేతికి అందిన పంటను రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న నీళ్లు చాలట్లేదు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక నారాయణపూర్ జలాశయంపై ఆధారపడటం మినహా తెలంగాణ ముందు ఇతరత్రా మార్గాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తో రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. నీటి విడుదలకు చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నీటి విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, అధికారికంగా ఓ వినతి పత్రాన్ని అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని బెంగళూరుకు పంపింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ మేఘారెడ్డి, జీ మధుసూదన్ రెడ్డి ఉన్నారు. బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు వారంతా. జూరాల ప్రాజెక్టు పరిధిలోని పంటలను రక్షించేందుకు వీలుగా విడతలవారీగా అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు సచివాలయంలో రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. నారాయణపూర్ నుండి విడుదల చేసే నీరు జూరాలకు చేరడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో తక్షణమే నీటిని విడుదల చేసేలా కోరాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి సూచించారు. 2019లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు కర్ణాటక ప్రభుత్వం జూరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read More...

షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతం : కారులో ముక్కలుగా లభించిన మృత దేహం : భార్య, కొడుకు మిస్సింగ్‌

షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్నాటకకు చెందిన అల్విన్‌ ప్రకాశ్‌ కుందర్‌గా అక్కడి అధికారులు నిర్దారించారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్‌  గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్‌ ప్రశాంత్‌ కుందర్‌ ఫోన్‌ చేశారు. అల్విన్‌ కాల్‌ ఎత్తకపోగా, తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్‌ పంపారు. సాధారణంగా వాయిస్‌ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్‌ ఇలా టెక్స్ట్‌ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అల్విన్‌ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి అక్కడి వాచ్‌మన్‌ ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్‌ వివరాలను పరిశీలించారు. అల్విన్‌ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. రెండు నెలల తర్వాత ఒమన్‌ వైపు వెళ్లే మార్గంలో పార్క్‌ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్‌దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. అల్విన్‌ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్విన్‌ సోదరుడు అనిల్‌ ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్‌ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్‌ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.

Read More...

బెంగళూరులో రెస్టారెంట్ ముందు నిలిపిన లగ్జరీ కారులో మృతదేహం

బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ ముందు నిలిపి ఉంచిన ఓ లగ్జరీ కారులో 46 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మొన్న అర్ధరాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో ఆ రెస్టారెంట్ ముందు వచ్చి ఆగిన కారులోని వ్యక్తి, అందులోనే అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం చాలా సేపటి వరకు ఆ కారు అక్కడే కదలకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు తలుపులు తెరిచి చూడగా లోపల సలీమ్ అక్బర్ అనే వ్యక్తి అచేతనంగా పడి వున్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొడగు జిల్లాకు చెందిన ఇతని ఆకస్మిక మరణంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా, గుండెపోటు లేదా ఆకస్మిక అనారోగ్యం కారణంగా ఈ మరణం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి హింస లేదా బయటి వ్యక్తుల కుట్ర ఉన్నట్లు ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. 

Read More...

అమిత్ షాకు అస్వస్థత

కర్ణాటకలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం మందగించడంతో హుబ్బళ్లిలో ముందుగా షెడ్యూల్ చేసిన అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. వైద్యులు ఆయనకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, షా బస చేసిన హోటల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. హుబ్బళ్లిలోని ప్రముఖ కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసవిర్మఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనంతో పాటు, రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 1,200 పడకల కేఎల్‌ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది. ఈ కీలక కార్యక్రమం కోసం ఆయన శుక్రవారం రాత్రే షెడ్యూల్ ప్రకారం హుబ్బళ్లికి చేరుకుని ఒక హోటల్‌లో బస చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో, ఆయన బదులుగా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, అలాగే మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ వేడుకలో పాల్గొని భవనాలను ప్రారంభించారు. అమిత్ షా గైర్హాజరీపై సర్వత్రా చర్చ జరగడంతో కేఎల్‌ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే స్పష్టతనిచ్చారు. కేవలం అనారోగ్య కారణాల వల్లే అమిత్ షా ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఆయన స్పష్టం చేశారు. వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read More...

నర్సు మధుమితపై ఆమె భర్త వెంకటేశన్‌ యాసిడ్‌తో దాడి : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సు

బెంగళూరులో నర్సు మధుమితపై ఆమె భర్త వెంకటేశన్‌ దాడికి పాల్పడ్డాడు. దంపతుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఆమె గత ఏడాదిన్నరగా ఓ ప్రైవేటు క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఉదయం 9.15 గంటల సమయంలో మధుమిత అల్పాహారం కోసం క్లినిక్‌ నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త వెంకటేశన్‌ ఆమెను వెంబడిస్తూ క్లినిక్‌ ఉన్న బహుళ అంతస్తుల భవనం దిగువ అంతస్తులోని పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. తమిళనాడుకు చెందిన వెంకటేశన్‌ ద్విచక్రవాహనంపై కత్తి, కొడవలి, యాసిడ్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. పార్కింగ్‌ ప్రాంతంలో మధుమితపై వెంకటేశన్‌ కొడవలితో దాడి చేసి, అనంతరం ఆమెపై యాసిడ్‌ పోశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో క్లినిక్‌ సిబ్బంది, స్థానికులు ఆమెను కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు. కొందరు వ్యక్తులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా అతడు దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఘటనను గుర్తించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మధుమిత ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జేపీ నగర్‌ పోలీసులు స్థలాన్ని పరిశీలించి వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అతడిని ప్రశ్నిస్తున్నారు. 

Read More...

ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోంది : ట్రంప్ మా గ్యారెంటీ స్కీమ్స్‌ను కాపీ కొడుతున్నారు

బెంగళూరులో ఇవాళ డీకే శివకుమార్ మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఇదే సమయంలో అమెరికా రాజకీయాల్లో ట్రంప్ తాజాగా చేసిన ఓ హామీని ఆయన ప్రస్తావించారు. నవంబర్‌లో జరిగే మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభ, సెనెట్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్ల చొప్పున 'డివిడెండ్‌' అందిస్తామని ట్రంప్ ప్రతిపాదించినట్లు శివకుమార్ పేర్కొన్నారు. కాగా, ఐర్లాండ్‌లో గత ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి వయోజనుడికి 5,000 డాలర్లు ఇవ్వడం సాధ్యమేనని చెప్పారు. అమెరికా ప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం సమీకరిస్తోందని, అందువల్ల ఈ డబ్బు చెల్లింపు పెద్ద సమస్య కాదని అన్నారు. గతంలో డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ తొలిసారి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోకి భారీగా ఆదాయం వస్తోందని, దీంతో ప్రజలకు 5,000 డాలర్లు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డీకే శివకుమార్ పైవిధంగా స్పందించారు.

Read More...

ఇంట్లో ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం : ఇద్దరికి తీవ్ర గాయాలు

కర్ణాటకలోని బెలాగావిలో ఇంట్లో సోమవారం అర్ధరాత్రి రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెలాగావిలోని సెంట్రల్ బస్ స్టాండ్ సమీపంలోని చావత్ గల్లీలో ఈ ప్రమాదం జరిగింది. దామోనే కుటుంబం గణేష్ చతుర్థి వేడుకల కోసం తమ ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రాత్రి భోజనం ముగించుకుని కుటుంబ సభ్యులందరూ ఎప్పట్లాగే నిద్రపోవడానికి వెళ్లారు. సోమవారం రాత్రి సుమారు 2:15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శబ్దం వచ్చిన వైపునకు వెళ్లి చూడగా, ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటల్లో చిక్కుకున్న గజానన్ దామోనే, రోషన్‌లను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అయితే, అప్పటికే తీవ్ర మంటలు వ్యాపించడంతో మిగతా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గజానన్, రోషన్‌లను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి సుమారు 60 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని భారతి దామోనే (50), శారద దామోనే (45), గంగ దామోనే (25), ప్రియ దామోనే (24)గా గుర్తించారు. మృతుల్లో శారద.. గజానన్ భార్య కాగా, భారతి దామోనే ఆయన సోదరి. ప్రియ, గంగలు వారి కుమార్తెలు కాగా, రోషన్ కుమారుడు. గజానన్ వడ్రంగిగా పని చేస్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రిఫ్రిజిరేటర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఫ్రిజ్ ఎందుకు పేలిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గణేష్ విగ్రహం వద్ద అలంకరించిన విద్యుత్ దీపాల వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందా? లేక వేరే కారణాల వల్ల ఈ పేలుడు సంభవించిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More...

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం, ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్‌ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్‌ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్‌ కోసం గాలిస్తున్నారు.

Read More...