పంజాబ్ నుంచి బీహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్ పురా సమీపంలో గల సరాయ్ బంజారా గ్రామం వద్ద రైలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో రైలు బోగీలలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వెళ్తున్న సమయంలో ప్యాంట్రీ కార్ నుంచి మొదలైన మంటలు క్రమంగా ఇతర బోగీలకు వ్యాపించినట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అలారం మోగడంతో ప్రయాణీకులు సమయస్ఫూర్తితో అప్రమత్తమైన రైలు ఆగిన వెంటే కిందకు దిగిపోయారు. ఘటనాస్థలికి సంబంధించిన వీడియోల్లో చాలా వరకు పొగలు కమ్ముకోవడమే కాకుండా భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం కనిపించింది. పండగల సీజన్ కావడంతో రైలు ప్రయాణీకులతో తీవ్ర రద్దీగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాంశు అగర్వాల్ అందించిన వివరాల ప్రకారం.. ఫైర్ అలారం మోగడం వల్ల ప్రయాణీకులు త్వరగా బయటకు రాగలిగారని, ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ తీవ్ర గాయాలు కానీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
3
Beranda
› blaze erupted while the train was passing near Sarai Banjara village
› close to Rajpura in the Patiala district
› indian railways
› Major Fire Aboard Karmabhumi Express
› national
› traveling from Punjab to Bihar
› కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం
Subscribe to:
Post Comments (Atom)
